Saturday, 16 May 2026
  • Home  
  • టీటీడీ నిధులపై భూమన సమాధానం చెప్పాలి-ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
- తిరుపతి

టీటీడీ నిధులపై భూమన సమాధానం చెప్పాలి-ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

శ్రీకాళహస్తి, మే 15 (పున్నమి టెంపుల్ న్యూస్): బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి టీటీడీ వ్యవహారాల్లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై పూర్తి స్థాయి విచారణ జరగాల్సిందేనని పేర్కొన్నారు. శ్రీకాళహస్తిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, టీటీడీ బోర్డు మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పారదర్శకత గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. శ్రీవాణి ట్రస్ట్ నిధులను ఎటు మళ్లించారో ప్రజలకు స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు.భక్తుల దర్శన టికెట్ల విషయంలో అవకతవకలు జరిగాయని, శ్రీవాణి టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించలేదని ఆరోపించారు. టీటీడీలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ విచారణ కొనసాగుతుండటంతో వైసీపీ నేతలు ఆందోళన చెందుతున్నారని విమర్శించారు. ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం వంటి ఘటనలను కప్పిపుచ్చుకునేందుకే సోషల్ మీడియాలో విషప్రచారం చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో శ్రీవాణి నిధులతో వచ్చే రెండేళ్లలో 5 వేల ఆలయాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. 2026 నుంచి పూర్తిస్థాయి ఆన్‌లైన్ విధానం అమలు చేసి దళారీ వ్యవస్థను నిర్మూలిస్తామని స్పష్టం చేశారు. స్వామివారి నిధులను దుర్వినియోగం చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే హెచ్చరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.