శ్రీకాళహస్తి, మే 12 (పున్నమి టెంపుల్ న్యూస్): శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి జన్మదిన వేడుకలను ఈ నెల 15వ తేదీన వైభవంగా నిర్వహించనున్నట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయ నిర్వాహకులు తెలిపారు. జన్మదినోత్సవం సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆ రోజు ఉదయం 8:30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అందుబాటులో ఉంటారని వెల్లడించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, నియోజకవర్గ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై మాజీ ఎమ్మెల్యేను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలని పార్టీ వర్గాలు కోరాయి. కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.


