Friday, 8 May 2026
  • Home  
  • ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరం
- తిరుపతి

ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరం

శ్రీకాళహస్తి, మే 08 (పున్నమి న్యూస్): ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్, ఎంజీఎం హాస్పిటల్స్ సంయుక్త ఆధ్వర్యంలో మార్కెట్ యార్డ్‌లో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 150 మందికి పైగా ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య సలహాలు అందించారు. సంత రోజు కావడంతో మార్కెట్‌కు వచ్చిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని శిబిరాన్ని వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డ్ చైర్మన్ రంగినేని చెంచయ్య నాయుడు మాట్లాడుతూ.. ప్రజారోగ్య పరిరక్షణకు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రజలకు చేరువయ్యే విధంగా ప్రెస్ క్లబ్, ఎంజీఎం యాజమాన్యం వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం ఎంజీఎం మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వివేక్ చైతన్య మాట్లాడుతూ….ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఓఆర్‌ఎస్ వంటి ద్రవపదార్థాలు ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ఎంజీఎం ఆస్పత్రిలో 24 గంటల వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. శిబిరంలో గుండె, ఎముకలు, స్త్రీలు, శిశువుల ఆరోగ్య సమస్యలకు సంబంధించి నిపుణులైన వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేణుగోపాల్, కమిటీ సభ్యులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, ఎంజీఎం ఆస్పత్రి వైద్య బృందం పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.