*మున్సిపల్ చైర్మన్ సి.ఎం. సురేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన కమిషనర్ చంద్రశేఖర్ రావు*
తెలంగాణ జోగులాంబ గద్వాల జిల్లా ఐజ (పున్నమి ప్రతినిధి)
ఐజ మున్సిపాలిటీ నూతన కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన *శ్రీ చంద్రశేఖర్ రావు గారు బుధవారం మున్సిపల్ చైర్మన్ శ్రీ సి.ఎం. సురేష్ గారిని* వారి ఛాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మున్సిపల్ పాలకవర్గం నూతన కమిషనర్ కి స్వాగతం పలికింది. మున్సిపల్ కమిషనర్ & చైర్మన్ గార్లు మాట్లాడుతూ.. ఐజ పట్టణాభివృద్ధి కోసం అధికారులు మరియు పాలకవర్గం సమన్వయంతో పనిచేయాలని, ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుదామని ఐజ పట్టణ అభివృద్ధికి సంబంధించిన విషయాలు చర్చించారు.
– ఈ మర్యాదపూర్వక భేటీలో మున్సిపల్ చైర్మన్ సి.ఎం. సురేష్ గారు, కౌన్సిలర్లు మరియు కో-ఆప్షన్ సభ్యులతో కలిసి కమిషనర్ గారిని శాలువాతో గౌరవపూర్వకంగా సన్మానించారు. అనంతరం కమిషనర్ గారు కూడా చైర్మన్ గారిని మర్యాదపూర్వకంగా సన్మానించారు..
ఈ కార్యక్రమంలో *1వ వార్డు కౌన్సిలర్ తిరుమలేష్ గారు, 2వ వార్డు కౌన్సిలర్ రజాక్ గారు, 9వ వార్డు కౌన్సిలర్ శివ గారు, 14వ వార్డు కౌన్సిలర్ డా.కృష్ణ గారు, కో-ఆప్షన్ సభ్యులు నాగన్న గౌడ్ గారు, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లికార్జున రెడ్డి గారు, గజ్జి దేవరాజ్ గారు, యువజన నాయకులు అశ్వ పెద్దయ్య గారు, PGK రఘు గారు, మాజీ కౌన్సిలర్ మురళి గారు, పూజారి అశోక్ గారు, రుద్ర గారు, చాంద్ గారు* తదితరులు పాల్గొన్నారు.

