శ్రీకాళహస్తి, మే 04 (పున్నమి న్యూస్):శ్రీకాళహస్తి మండలంలోని అబ్బపట్లపల్లి గ్రామంలో వెలసిన శ్రీ బత్తినయ్య స్వామి సమారాధన మహోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది. వేడుకల భాగంగా సుధాకర్, అనూష దంపతుల ఆధ్వర్యంలో భక్తులకు భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి తల్లి శ్రీమతి బొజ్జల బృందమ్మ ముఖ్య అతిథిగా హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె స్వయంగా భక్తులకు అన్నప్రసాదం వడ్డించి వారి అభిమానం చాటుకున్నారు. భక్తులతో కొద్దిసేపు ముచ్చటిస్తూ వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఛైర్మన్ రంగినేని చెంచయ్య నాయుడు, పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమారాధన మహోత్సవం సందర్భంగా గ్రామంలో భక్తి పారవశ్యం నెలకొంది.

అబ్బపట్లపల్లిలో ఘనంగా బత్తినయ్య స్వామి సమారాధన