ముస్తాబాద్ మే 3 పున్నమి ప్రతినిధి
ముస్తాబాద్ మండల కేంద్రం సహా సేవాలాల్ తండా, మోహినికుంట, చీకోడ్, గోపాల్‌పల్లె, గూడూరు గ్రామాల్లో జరిగిన నూతన గృహప్రవేశ కార్యక్రమాల్లో జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి. ఎల్ల బాల్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ తలారి రాణి నర్సయ్య పాల్గొన్నారు. గూడు లేని పేదలు ఉండకూడదన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల పంపిణీలో అర్హులందరికీ ఇళ్లు అందజేస్తామని తెలిపారు. లబ్ధిదారులకు కేకే మహేందర్‌రెడ్డి తరఫున పట్టు వస్త్రాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు
ఉప సర్పంచ్లు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.


