Saturday, 2 May 2026
  • Home  
  • బడి పిలుస్తోంది’ రథయాత్ర ప్రారంభం-ప్రభుత్వ పాఠశాలలే మెరుగైన భవిష్యత్తుకు బాట
- తిరుపతి

బడి పిలుస్తోంది’ రథయాత్ర ప్రారంభం-ప్రభుత్వ పాఠశాలలే మెరుగైన భవిష్యత్తుకు బాట

శ్రీకాళహస్తి, మే 02 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధిస్తున్నారని, మెరుగైన భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పించాలని ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు పిలుపునిచ్చారు. ‘36 మండలాలు – 36 రోజులు’ కార్యక్రమంలో భాగంగా శనివారం 8వ రోజు ‘బడి పిలుస్తోంది’ ఎన్రోల్మెంట్ డ్రైవ్ ప్రచార రథాన్ని పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నుంచి ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఏఎంసీ చైర్మన్ గంగినేని చెంచయ్య నాయుడు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గురవారెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి కె.వి.ఎన్. కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అర్హత కలిగిన ఉపాధ్యాయుల బోధనతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో రాష్ట్రస్థాయి ప్రతిభ కనబరుస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, బ్యాగులు, షూ, సాక్స్, డిక్షనరీలతో పాటు నాణ్యమైన విద్య అందుతున్నదని వివరించారు. ఆధునిక సాంకేతికతతో కూడిన ఐఎఫ్‌పీ ప్యానెల్స్ ద్వారా డిజిటల్ తరగతులు నిర్వహిస్తూ విద్యార్థులకు సమగ్ర విద్యను అందిస్తున్నామని తెలిపారు. అలాగే పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం, ‘తల్లికి వందనం’ వంటి సంక్షేమ పథకాలు విద్యార్థుల అభివృద్ధికి దోహదపడుతున్నాయని చెప్పారు. మండుటెండను లెక్కచేయకుండా పట్టణంలోని నాలుగు మాడ వీధులతో పాటు అల్లిమడుగు, చిన్న మిట్టకండ్రిగ, వేడం, తొండమనాడు, అక్కుర్తి, మంగళపురి, ముచ్చివోలు తదితర గ్రామాల్లో ప్రచార ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ వెంకటసుబ్బారెడ్డి, సెక్టోరియల్ అధికారులు, ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.