శుక్రవారం రాత్రి జమ్మలమడుగు-మైదుకూరు బైపాస్ రోడ్డులో శ్రీదేవి ఫంక్షన్ హాల్ వద్ద గుర్తు తెలియని ట్రాక్టర్ డీ కొనడంతో నంద్యాల(D) చాగలమర్రికి చెందిన ఆకుమళ్ళ షరీఫ్(22), దువ్వూరు(M) కృష్ణంపల్లెకు చెందిన అందె నరసింహులు స్పాట్లో మృతి చెందారు. చాగలమర్రి(M) చిన్నవంగలి గ్రామానికి చెందిన ఇమాంఖాసిం తీవ్రంగా గాయపడ్డాడు. ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృత దేహాలను ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ట్రాక్టర్ కోసం గాలిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని రూరల్ సీఐ నాగభూషణ్ తెలిపారు.



