ఒవైసీ కాలేజీ ఆక్రమణలపై హైడ్రా ఎందుకు మౌనంగా ఉంటుంది?
పున్నమి న్యూస్
01 మే 2026
తెలంగాణ ఇంచార్జి
పేదల ఇండ్లు కూల్చడంలో చూపించిన అత్యుత్సాహం చెరువులు ఆక్రమించి కడుతుంటే కనపడట్లేదా!
హైడ్రాపై మరోసారి తెలంగాణ హైకోర్టు ఆగ్రహం
సల్కం చెరువును ఆక్రమించి నిర్మించిన ఒవైసీ విద్యాసంస్థలకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఓ న్యాయవాది
ఈ పిటిషన్ విచారిస్తూ పేదల ఇళ్ల మీదకి ఎలాంటి నిబంధనలు లేకుండా వెళ్లే హైడ్రాకు ఒవైసీ కాలేజీ పట్ల వివక్ష ఎందుకని నిలదీసిన న్యాయమూర్తి
ఎఫ్టీఎల్, బఫర్ జోన్ నిర్థారణకు రెండు నెలల సమయం ఇవ్వాలని ప్రభుత్వం తరపు న్యాయవాది కోరగా, ఎన్ని ఏళ్లు ఏం చేశారని, ఆక్రమణలకు బాధ్యులైన అధికారులపై నివేదిక తయారు చేయాలని హైకోర్టు ఆదేశాలు
ఒవైసీ విద్యాసంస్థలో చదువుతున్న వారిని ప్రభుత్వ విద్యా సంస్థల్లోకి మార్చాలని, బయటికి వెళ్లాలనుకునే వారికి ఒవైసీ కాలేజీ యాజమాన్యం సహకరించాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను జూలై 3వ తేదీకి వాయిదా వేసిన హైకోర్టు



