Friday, 1 May 2026
  • Home  
  • వింజమూరులో ఎమ్మెల్యే చేతుల మీదుగా భారత్ ఫార్మసీ ప్రారంభం
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వింజమూరులో ఎమ్మెల్యే చేతుల మీదుగా భారత్ ఫార్మసీ ప్రారంభం

వింజమూరు మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన భారత్ ఫార్మసీ వెటర్నరీ మెడికల్ షాప్‌ను ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఘనంగా ప్రారంభించారు. రిబ్బన్ కట్ చేసి షాప్‌ను ప్రారంభించిన ఆయన, గ్రామీణ ప్రాంతాల్లో పశువైద్య సేవలు అందుబాటులోకి రావడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. రైతులు, పశుపాలకులు తమ పశువులకు అవసరమైన ఔషధాలు సకాలంలో పొందేందుకు ఈ ఫార్మసీ ఉపయోగపడుతుందని తెలిపారు. యాజమాన్యం నాణ్యమైన సేవలు అందిస్తూ ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోవాలని సూచించారు. ఈ కేంద్రం అభివృద్ధి చెందుతూ మండలానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.