శ్రీకాళహస్తి, ఏప్రిల్ 29 (పున్నమి న్యూస్( : శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని బండారుపల్లి గ్రామంలో అత్యంత వైభవంగా జరుగుతున్న గ్రామ దేవత జాతర మహోత్సవాల్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్ పాల్గొన్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు మరియు కూటమి నాయకుల ప్రత్యేక ఆహ్వానం మేరకు బుధవారం ఆయన గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామానికి చేరుకున్న ఆయనకు స్థానిక ప్రజలు, కూటమి శ్రేణులు ఘన స్వాగతం పలికారు. కోలా ఆనంద్ గ్రామ దేవతను దర్శించుకుని, ఆలయంలో ప్రత్యేక పూజలు మరియు అర్చనలు నిర్వహించారు. తీర్థప్రసాదాలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జాతరలు అనేవి కేవలం వేడుకలు మాత్రమే కాదని, అవి మన పూర్వీకులు అందించిన గ్రామీణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకలని పేర్కొన్నారు. ఇటువంటి ఉత్సవాల ద్వారా గ్రామాల్లో ఐక్యత, సోదరభావం పెంపొందుతాయని ఆనందం వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, అమ్మవారి కరుణాకటాక్షాలు అందరిపై నిరంతరం ఉండాలని తాను ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో గ్రామాల అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సుబ్రహ్మణ్యం, పార్టీ ముఖ్య కార్యకర్తలు, గ్రామస్తులు, కూటమి పార్టీల నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

గ్రామీణ సంస్కృతీ సంప్రదాయాలకు జాతరలే నిలువుటద్దాలు-కోలా ఆనంద్