ముస్తాబాద్ ఏప్రిల్ 28 పున్నమి ప్రతినిధి
KCR కప్ – 2026 క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమంలో భాగంగా గౌరవ BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆధ్వర్యంలో 13 MPTC గ్రామాల టీమ్‌లకు కేసీఆర్ కప్ క్రికెట్ కిట్‌లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ మండల BRS పార్టీ అధ్యక్షులు భోంపెల్లి సురేందర్ రావు, ముస్తాబాద్ పట్టణ BRS పార్టీ అధ్యక్షులు ఏద్దండి నర్సింహా రెడ్డి, సోషల్ మీడియా వారియర్స్ బద్ది పడిగే నందు తదితరులు పాల్గొన్నారు. కిట్‌ల పంపిణీ చేసిన కేటీఆర్ గారికి మండల పార్టీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.


