ఆంధ్ర ప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం- అనుబంధ సంస్థ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక, నెల్లూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం దర్గామిట్ట శ్రీ వెంకటేశ్వర విద్యాలయం ఉన్నత పాఠశాలలో 50 మంది విద్యార్థులకు 12 రకాల పాఠ్యేతర పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేశారు. వేసవి సెలవులు మొదలవుతున్న సమయంలో విద్యార్థులు స్మార్ట్ ఫోన్, టాబ్ తదితర యాంత్రిక పరికరాలుకు అంకితమై పోకుండా పుస్తక పఠనాశక్తి పెంచుకోవాలని ఈ సందర్భంగా గ్రంథాలయ పునర్వికాస వేదిక, నెల్లూరు జిల్లా కన్వీనర్ – అంతర్జాతీయ కవి, సార్క్ సాహిత్య పురస్కార గ్రహీత డా పెరుగు రామకృష్ణ కోరారు.
పుస్తకం మాత్రమే మనల్ని సంపూర్ణ వ్యక్తిగా తీర్చి దిద్దుతుందని అన్నారు. జీవితం లో ఉన్నత విలువలు, నైతికత కేవలం సృజనాత్మక సాహిత్యం చదవడం ద్వారానే సాధ్యమని చెప్పారు.
పుస్తక పఠనం కు పిల్లలు జీవితం లో ఏ దశలోనూ దూరం కాకుండా ఉండాలని సూచించారు. పుస్తకాన్ని మించిన నేస్తం మరొకటి లేదని అరసం నెల్లూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ అన్నారు. సెలవల్లో కథల పుస్తకాలు చదివితే మంచి భాష వస్తుందని అన్నారు.విషయ పరిజ్ఞానం కోసం మాతృ భాషలో పుస్తకాలు క్షుణ్ణంగా చదవడం అవసరం అన్నారు.పాఠశాల విద్యార్థులకోసం ప్రత్యేకించి సామూహిక పుస్తకపఠనం కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని ఉద్యమ వేదిక రాష్ట్ర నాయకత్వం నిర్ణయించిందని, అన్ని జిల్లా శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తూన్నామని డా గంగిశెట్టి చెప్పారు. అరసం నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కరుణశ్రీ ఈ కార్యక్రమం లో 50 మంది విద్యార్థులను ఒక బృందం గా చేసి నీతి కథలు, జీవిత చరిత్రలు, మొదలగు పుస్తకాలు ఉచితంగా ఇచ్చి చదివింపచేసి, వాటిపై అవగాహన పెంచి మాట్లాడిస్తామని,సొంత గ్రంథాలయ స్పృహ పెంచి క్రమశిక్షణ,వ్యక్తిత్వ వికాసం,నైతిక విలువలు పట్ల అవగాహన, సృజనాత్మక భావాలు వెల్లి విరిసేలా చేసి మెరుగైన పౌరులుగా తీర్చిదిద్దే విధంగా కృషి చేస్తామని అన్నారు.
ప్రత్యేక అతిథిగా హాజరైన సుప్రసిద్ధ కథా, నవలా రచయిత పొట్లూరు సుబ్రహ్మణ్యం ఈ విలక్షణ కార్యక్రమం లో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు.
ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, 8,9,10 తరగతుల విద్యార్థులు పాల్గొని పుస్తక పఠనం చేశారు.

వెలగ వెంకటప్పయ్య ఆశయాలతో గ్రంథాలయ ఉద్యమం జోరు”: డాక్టర్ గంగి శెట్టి శివకుమార్
ఆంధ్ర ప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం- అనుబంధ సంస్థ గ్రంథాలయ పునర్వికాస ఉద్యమ వేదిక, నెల్లూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం దర్గామిట్ట శ్రీ వెంకటేశ్వర విద్యాలయం ఉన్నత పాఠశాలలో 50 మంది విద్యార్థులకు 12 రకాల పాఠ్యేతర పుస్తకాలు ఉచితంగా పంపిణీ చేశారు. వేసవి సెలవులు మొదలవుతున్న సమయంలో విద్యార్థులు స్మార్ట్ ఫోన్, టాబ్ తదితర యాంత్రిక పరికరాలుకు అంకితమై పోకుండా పుస్తక పఠనాశక్తి పెంచుకోవాలని ఈ సందర్భంగా గ్రంథాలయ పునర్వికాస వేదిక, నెల్లూరు జిల్లా కన్వీనర్ – అంతర్జాతీయ కవి, సార్క్ సాహిత్య పురస్కార గ్రహీత డా పెరుగు రామకృష్ణ కోరారు. పుస్తకం మాత్రమే మనల్ని సంపూర్ణ వ్యక్తిగా తీర్చి దిద్దుతుందని అన్నారు. జీవితం లో ఉన్నత విలువలు, నైతికత కేవలం సృజనాత్మక సాహిత్యం చదవడం ద్వారానే సాధ్యమని చెప్పారు. పుస్తక పఠనం కు పిల్లలు జీవితం లో ఏ దశలోనూ దూరం కాకుండా ఉండాలని సూచించారు. పుస్తకాన్ని మించిన నేస్తం మరొకటి లేదని అరసం నెల్లూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ అన్నారు. సెలవల్లో కథల పుస్తకాలు చదివితే మంచి భాష వస్తుందని అన్నారు.విషయ పరిజ్ఞానం కోసం మాతృ భాషలో పుస్తకాలు క్షుణ్ణంగా చదవడం అవసరం అన్నారు.పాఠశాల విద్యార్థులకోసం ప్రత్యేకించి సామూహిక పుస్తకపఠనం కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలని ఉద్యమ వేదిక రాష్ట్ర నాయకత్వం నిర్ణయించిందని, అన్ని జిల్లా శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తూన్నామని డా గంగిశెట్టి చెప్పారు. అరసం నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కరుణశ్రీ ఈ కార్యక్రమం లో 50 మంది విద్యార్థులను ఒక బృందం గా చేసి నీతి కథలు, జీవిత చరిత్రలు, మొదలగు పుస్తకాలు ఉచితంగా ఇచ్చి చదివింపచేసి, వాటిపై అవగాహన పెంచి మాట్లాడిస్తామని,సొంత గ్రంథాలయ స్పృహ పెంచి క్రమశిక్షణ,వ్యక్తిత్వ వికాసం,నైతిక విలువలు పట్ల అవగాహన, సృజనాత్మక భావాలు వెల్లి విరిసేలా చేసి మెరుగైన పౌరులుగా తీర్చిదిద్దే విధంగా కృషి చేస్తామని అన్నారు. ప్రత్యేక అతిథిగా హాజరైన సుప్రసిద్ధ కథా, నవలా రచయిత పొట్లూరు సుబ్రహ్మణ్యం ఈ విలక్షణ కార్యక్రమం లో పాల్గొనడం ఆనందంగా ఉందని అన్నారు. ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, 8,9,10 తరగతుల విద్యార్థులు పాల్గొని పుస్తక పఠనం చేశారు.

