శ్రీకాళహస్తి, ఏప్రిల్ 20 (పున్నమి న్యూస్( శ్రీకాళహస్తి పట్టణంలోని పెళ్లి మండపం వద్ద సోమవారం శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో బాటసారులకు, భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. ప్రముఖ వైద్యులు డాక్టర్ మేలచూరు చంద్రశేఖర్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, తన చేతుల మీదుగా మజ్జిగను అందజేశారు. ఎండ తీవ్రతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఇలాంటి సేవలు అందించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా సత్యసాయి సేవా సమితి కన్వీనర్ పాండురంగయ్య మాట్లాడుతూ.. ఈ నెల 24న జరగనున్న శ్రీ సత్యసాయి బాబా వర్ధంతి (ఆరాధన మహోత్సవం) పురస్కరించుకుని ఈ మజ్జిగ పంపిణీ చేపట్టినట్లు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా 24వ తేదీన మహానారాయణ సేవ నిర్వహిస్తామని, అలాగే అదే రోజున బాలవికాస్ పిల్లలకు వేసవి తరగతులు కూడా ప్రారంభమవుతాయని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు, సత్యసాయి సేవా సమితి వాలంటీర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సత్యసాయి వర్ధంతి సందర్భంగా ‘చల్లని’ సేవ