విజయవాడ పున్నమి ప్రతినిధి సురేష్
విజయవాడ ఆటోనగర్ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను ఆదేశాలు మేరకు ఉమ్మడి కృష్ణాజిల్లా జనసేన పార్టీ సీనియర్ నాయకులు, ఆటోమొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్
ఉపాధ్యక్షులు నెరుసు కృష్ణాంజనేయులు ఆధ్వర్యంలో శ్రీ అభయ ఆంజనేయస్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ ఇటీవల అనారోగ్యంతో ఇబ్బంది పడి శస్త్ర చికిత్స అనంతరం కోలుకుంటున్న నేపథ్యంలో ఆయన ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళల ఆధ్వర్యంలో సర్వమత ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో మరియు గిరిజన ప్రాంతాల్లో కూడా మౌలిక వసతులు కల్పించిన ఏకైక ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని కొనియాడారు. కౌలు రైతుల కుటుంబాలకు, భవన నిర్మాణ రంగాలకు చెందిన కుటుంబాలకు ఆయన ఇచ్చిన భరోసా ఆయనకి ఆశీస్సులు అని తెలిపారు.
ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ట్విట్ చేసి త్వరగా కోలుకోవాలని చెప్పారంటే ఆది ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం అన్నారు. సోషల్ మీడియా ద్వారా తెలిసిన, విద్యార్థుల ద్వారా తెలిసిన గ్రామాల్లో మౌలిక సదుపాయాలతో పాటు రోడ్లు కూడా వేయించి దశాబ్దాల పాటు ఉన్నటువంటి సమస్యను తీర్చి వారి ముఖంలో చిరునవ్వును ఆనందాన్ని చూసిన ఘనత పవన్ కళ్యాణ్ కి దక్కిందన్నారు. కాంగ్రెస్ హాయంలో పీసీసీ అధ్యక్షుడిగా, మంత్రిగా వెనుక బడిన జిల్లాలో రోడ్లు, మౌలిక వసతులు కల్పించలేని పరిస్థితినీ, ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అందుకు భిన్నంగా విద్యార్థి అడిగిన వెంటనే రోడ్డు మంజూరు చేయించి, నిధులు విడుదల చేసిన ఘనత కూడా ఆయనకే దక్కిందని రఘువీరారెడ్డి ప్రసంశించడం జరిగిందన్నారు.
వీరందరి ఆశీస్సులు ప్రేమ, ఆప్యాయతలు ముఖ్యంగా జనసైనికులు, నాయకులు, కార్యకర్తలు, వీర మహిళల దీవెనలు పూర్తిస్థాయిలో ఉంటాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆటోమొబైల్ టెక్నీషియన్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు సత్యనారాయణ,
రాష్ట్ర పీఏసీ సంయుక్త కార్యదర్శి పోతిరెడ్డి అనిత, డివిజన్ అధ్యక్షులు రామాయణపు కోటి, పెనమలూరు సుధాకర్, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు వీర మహిళలు అచిత, కల్పన, పూర్ణిమ తదితరులు పాల్గొన్నారు.



