శ్రీకాళహస్తి, ఏప్రిల్ 15 (పున్నమి టెంపుల్ న్యూస్) శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలోని కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో త్రయోదశి, మాస శివరాత్రిని పురస్కరించుకుని ప్రదోష కాల పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. బుదాహవారం నాడు సాయంత్రం ప్రదోష వేళలో ఆలయ వేద పండితులు, అర్చకులు స్వామివారికి, నందీశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, విభూతి, పన్నీరు వంటి షోడశోపచార ద్రవ్యాలతో అభిషేకం చేసి, అనంతరం బిల్వ పత్రాలు, సుగంధ పుష్పాలతో అలంకరించారు. ప్రదోష పూజలో భాగంగా నందీశ్వరుడిని విశేషంగా అలంకరించి, ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. మాస శివరాత్రి సందర్భం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య జరిగిన ఈ పూజా కార్యక్రమాలతో ఆలయ ప్రాంగణమంతా శివనామస్మరణతో మారుమోగింది. లోకకళ్యాణార్థం నిర్వహించిన ఈ పూజలో భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

శ్రీకాళహస్తిలో వైభవంగా ప్రదోష కాల పూజలు-నందీశ్వరుడి సేవలో తరించిన భక్తులు