ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 15 ( పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలం చెరుకుమూడికి చెందిన ఏడుకొండల మృతిపై మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు డా. కాకాణి గోవర్ధన్ రెడ్డి గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్‌తో కలిసి బాధితులకు ధైర్యం చెప్పారు. పోలీసుల వేధింపుల వల్లే ఏడుకొండలు మృతి చెందారని ఆరోపిస్తూ, దీనిని లాకప్ డెత్‌గా పరిగణించి సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకు బాధిత కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై తిరుపతి ఎంపీ గురుమూర్తి కూడా ఆసుపత్రికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఏడుకొండల మృతిపై కాకాణి పరామర్శ.. న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని హామీ
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా జూలై 15 ( పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలం చెరుకుమూడికి చెందిన ఏడుకొండల మృతిపై మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు డా. కాకాణి గోవర్ధన్ రెడ్డి గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎమ్మెల్సీ మేరిగ మురళీధర్‌తో కలిసి బాధితులకు ధైర్యం చెప్పారు. పోలీసుల వేధింపుల వల్లే ఏడుకొండలు మృతి చెందారని ఆరోపిస్తూ, దీనిని లాకప్ డెత్‌గా పరిగణించి సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకు బాధిత కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై తిరుపతి ఎంపీ గురుమూర్తి కూడా ఆసుపత్రికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు.

