పశ్చిమాసియాలో గత ఆరు వారాలుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలను తగ్గించే దిశగా పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో అమెరికా ఇరాన్ ప్రతినిధులబృందం మధ్య ఇస్లామాబాద్‌లో శాంతి చర్చలు ప్రారంభమైన సందర్భంగా యుద్ధం వద్దు శాంతి ముద్దు అనే భావనతో ఈ కవిత
యుద్ధం మానవాళికి వినాశనం
విషాదం మిగిల్చే భయానక దృశ్యం
దేనికైనా సిద్ధమంటే నేటి కాలంలో యుద్ధమే
ఆధునిక మానవత్వ మనుగడకు విరుద్ధమే
ఇది కేవలం కాదు భూమిపై పోరాటం
జీవకళను బలికోరే అమానవీయ ఆరాటం
నెత్తుటినేలలు ఆర్తనాదాలు
కాలుష్యరోగాలు యుద్ధఫలితాలు
యుద్ధం గెలవడం కంటే యుద్ధాన్ని ఆపడం గొప్ప
జరిగే నష్టాన్ని ఎప్పటికీ భర్తీ చేయలేమని చెప్ప
యుద్ధం వద్దంటే అది రాజకీయ ఆర్థిక శుద్ధం
మానవాళి భవిష్యత్తును కాంక్షించే సమృద్ధం
కోర్కెల అదుపు క్రమబద్ధ జీవన బుద్ధం
సాంకేతిక యుగంలో బల నిరూపణలు నిషేధం
సామరస్య భావనతో శాంతి చర్చలు ప్రబద్ధం
ఆయుధం వీడితే శాంతిచర్చలు సంసిద్ధం
ప్రపంచ వాసుల శాంతి వచనాలు ప్రసిద్ధం
పునర్నిర్మాణ అభివృద్దే మన ఆశయ ప్రతిబద్ధం
సైనికుల రక్షణసేవలు నిబద్దం
యుద్ధం జీవన నిరాయుధం
ప్రశ్నార్థకం కాకూడదు మానవత్వం
యుద్ధం వద్దు శాంతి ముద్దు
శాంతియే నేటి ప్రపంచ జీవన గమ్యం.
ఇది చరిత్ర చెప్పే విశ్వజనీన సత్యం


