శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డిపై జనసేన బహిష్కృత నేత కోట వినుత చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. వైసిపి పాలనకు వ్యతిరేకంగా పోరాడి గెలిచిన సుధీర్ రెడ్డి నియోజకవర్గంలో టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. తెదేపా నాయకులు మాట్లాడుతూ…సుధీర్ రెడ్డి ఎప్పుడూ అధికారులను ప్రభావితం చేయరని, చట్ట నిబంధనల ప్రకారం పరిపాలన కొనసాగుతుందని స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణాలపై అధికారులు తీసుకునే చర్యలకు ఎమ్మెల్యేతో సంబంధం లేదని తెలిపారు. టీడీపీ–జనసేన పొత్తు 2023లో ప్రకటించబడిందని, అంతకుముందు విడివిడిగా రాజకీయ కార్యకలాపాలు సాగాయని గుర్తు చేశారు. ఆ సమయంలో జరిగిన విషయాలను వక్రీకరించి ప్రచారం చేయడం తగదని హెచ్చరించారు. ఎన్డీయే కూటమి పార్టీల మధ్య రాష్ట్రవ్యాప్తంగా, అలాగే శ్రీకాళహస్తి నియోజకవర్గంలోనూ సమన్వయం బలంగా ఉందని, జనసేనతో సంబంధం లేని వ్యక్తులు అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని సూచించారు. ఇకపై ఎమ్మెల్యేపై అసత్య ఆరోపణలు చేస్తే సహించబోమని స్పష్టం చేస్తూ, కోట వినుత దంపతులు తమ తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వన్నెకుల క్షత్రియ సంక్షేమం, అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి, గిరిజన సలహా మండలి సభ్యులు యం.సుబ్బయ్య, తెలుగుదేశం పార్టీ బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు,శ్రీకాళహస్తి పట్టణ కార్యనిర్వాహక కార్యదర్శి వజ్రం కిషోర్, తొట్టంబేడు మండల ప్రధాన కార్యదర్శి చిల్లకూరు మణి,నాయీ బ్రాహ్మణ సాధికార సమితి తిరుపతి పార్లమెంటు సోషల్ మీడియా కన్వీనర్ కోట చంద్రశేఖర్, తిరుపతి పార్లమెంటు నాయకులు గంగనపల్లి రమేష్,సులేమాన్,కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

సుధీర్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు ఖండన… అసత్య ప్రచారాలపై టీడీపీ నేతల ఆగ్రహం