కలిగిరి మండలం జిర్రావారిపాలెం గ్రామంలోని మార్కెటింగ్ యార్డ్‌ను ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సందర్శించారు. యార్డ్‌లోని సౌకర్యాలను పరిశీలించిన ఆయన, అక్కడి రైతులతో ముచ్చటిస్తూ వరి, మొక్కజొన్న, సెనగ పంటల దిగుబడులపై వివరాలు తెలుసుకున్నారు. పంటల కొనుగోలు విధానం, కనీస మద్దతు ధరల అమలు, మార్కెట్ ధరల పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. రైతుల సమస్యలను శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా అధికారులకు సూచనలు చేస్తానని తెలిపారు.



