అష్టావధానిసురభికి ఉగాది జాతీయ సాహిత్యఫురస్కారం💐
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో, మనంఫౌండేషన్ శ్రీపరాభవఉగాది జాతీయపురస్కారాలసభ రవీంద్రభారతిలో మంగళవారం ఉదయం ఘనంగానిర్వహించింది.ఈసందర్భంగా వివిధరంగాల ప్రముఖులను ఘనంగాసత్కరించిం
ది.మాజీ కేంద్రమంత్రి వేణుగోపాలాచారి, విశ్రాంత జిల్లాప్రధానన్యాయమూర్తి నేరెళ్ళమాల్యాద్రి, సినీదర్శకులు రేలంగినరసింహారావు, అష్టావధాని సురభి శంకరశర్మ, తదితరులుఅతిథులుగాపాల్గొన్నారు.
మనం వ్యవస్థాపకులు అధ్యక్షులు చక్రవర్తి మాట్లాడుతూ నేటి పురస్కారాలందుకున్న ప్రముఖులందరూ పరాభవను విజయీభ వ సూచకంగా భావించి వారి వారి రంగాలలో విశేషంగా కృషిచేసి సామాజిక దేశసేవ ధ్యేయంగా ముందుకు సాగాలన్నారు.వేణుగోపాలాచారి మట్లాడుతూ, పురస్కారగ్రహీతలను అభినందిస్తూ జాతి శ్రేయస్సు, సమాజాభ్యుదయం , ప్రస్తుత దేశసమస్యలపట్ల అవగాహన, ప్రతిఒక్కరి బాధ్యత కావాలన్నారు.
రేలంగి వారు ప్రసంగిస్తూ, ఆసక్తి ఉంటే, ఆశక్తి వస్తుందని ,కవులు కళాకారులు సంఘసేవకులపాత్ర దేశఉజ్వల భవితకు ఎంతో దోహదమౌతుందన్నారు. సురభి మాట్లాడుతూ, కృషిచేసేదేరంగమైనా సరే పవిత్రత ,ఐక్యత, నిబద్ధత, స్పష్టత, ఉండాలన్నారు.
సురభికి జాతీయ సాహిత్యపుస్కారం.
ఉభయ తెలుగు రాష్ట్రాలలో నేకాకుండా తమిళనాడు ,కర్ణాటక, మహారాష్ట్ర, తదితరప్రాంతాలలో 217అవధానాలు చేశారు . అవధానధుని అభినవ భర్తృహరి, అవధానసురభి, బిరుదులందుకొన్నారు.
అవధానరంగంలో తెలుగువిశ్వవిద్యాలయంపురస్కారం , అప్పటి ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావుచే రవీంద్రభారతిలో సత్కారం , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్టేట్ యూత్అవార్డ్ ,పద్మశ్రీ శోభారాజ్ గారిచే అన్నమయ్య సాహితీపురస్కారం,విజయవాడ సిద్ధార్థ మహిళాకళాశాల
గిడుగువారిపురస్కా
రం , నెహ్రూ యువకేంద్ర వివేకానంద యువశక్తి సాహితీపురస్కారం అందుకున్నారు.
ఆంధ్ర తెలంగాణ కర్ణాటక వివిధప్రాంతాలలో పలుసాహిత్యసంస్థలచే సాహిత్యపురస్కారాలందుకొన్నారు. అప్పటిగవర్నర్లు కృష్ణకాంత్ నరసింహన్
రోశయ్యలచే సన్మానాలందుకొన్నారు.
అధ్యాపకునిగా జిల్లాప్రభుత్వపురస్కారమందుకున్నసురభి పలు టీవీ మాధ్యమాలలో తమసేవలంలదించారు.
టీవీ9,సంస్కృతి, సీవిఆర్, ఆస్థా, యోగి, పియమ్ సి ,చానెళ్ళలోసమున్నత కార్యక్రమాలు నిర్వహించారు
పద్యాలతోరణం వేదికగా సామాజిక శతక పద్యహేలకు పిలుపునిచ్చి నూటయాభై శతకరచనలకు ప్రేరకులయ్యారు
కవిగా అవధానిగా,వ్యాఖ్యాతగా సభానిర్వాహకునిగా,
ప్రవచనకర్తగా , సాహితీవేత్తగా, వివిధమాధ్యమాల ప్రతినిధిగా, విశేషసేవలనందిస్తున్నసురభి ఇంకా విశిష్ట విజయాలందుకోవాలని ఆశిద్దాం.




