Monday, 30 March 2026
  • Home  
  • అమరవీరుడు భగత్ సింగ్ కి ఘన నివాళి
- గుంటూరు

అమరవీరుడు భగత్ సింగ్ కి ఘన నివాళి

మార్చి 29 @ గుంటూరు భగత్ సింగ్ 95వ వర్థంతి సందర్భంగా గుంటూరు అన్నదాన సమాజం ఆవరణంలోని దేశభక్త శ్రీ కొండా వెంకటప్పయ్య ఆడిటోరియం లో నీలం మందారావు మరియు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సభాకార్యక్రమాన్ని నిర్వహించారు. దేశభక్తి సినీ గేయాలాపన తో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య సమరంలో అత్యంత పిన్న వయస్సులో ప్రాణాలర్పించి, యువతలో దేశభక్తిని రగిలించిన విప్లవ వీరుడు భగత్ సింగ్‌ అని,1931 మార్చి 23న భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ల బలిదానాన్ని స్మరించుకుంటూ, వారి తెగింపు, త్యాగనిరతిని దేశం గుర్తుచేసుకుంటుందని ఆ మహనీయుడి త్యాగాలు సదా స్ఫూర్తిదాయకం అని, భగత్ సింగ్ కేవలం 23 ఏళ్ల వయసులో దేశం కోసం ఉరితాడును ముద్దాడిన సాహస యోధుడని, బ్రిటిష్ పాలనను ఎదిరించి, తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన వారి త్యాగాలు నేటి తరానికి ఆదర్శం అని, జరిగిన చారిత్రక సంఘటనలను నేటి తరానికి వివరించి దేశభక్తిని మానవ విలువలను పెంపొందించాలని, ఇటువంటి కార్యక్రమాలు దేశంలోని అన్ని ప్రాంతాలలో నిర్వహించుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ సందర్భంగా పాల్గొన్న అతిధులను జ్ఞాపిక శాలువాతో నిర్వహకులు సత్కరించారు. అనంతరం భగత్ సింగ్ పై ప్రదర్శించిన డాక్యుమెంటరీ చిత్రం ప్రేక్షకులు అందర్నీ ఆలోచింపజేసింది. ఈ కార్యక్రమంలో శ్రీ గుంటూరు అన్నదాన సమాజం కార్యనిర్వహణాధికారి గుణ్ణం శ్రీనివాసరావు, నటనాలయ వ్యవస్థాపక అధ్యక్షులు నీలం మందారావు, హృదయరాజ్, గుంటూరు స్పెషల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కె. శ్రీహరిరావు, గుంటూరు ప్రజా నాట్యమండలి జాతీయ కార్యదర్శి గని, డా. తూములూరి రాజేంద్ర ప్రసాద్, కాళంగి వంశీకృష్ణ, డా. బద్రి పీర్ కుమార్, భైరా శివపోతురాజు, బర్రె సత్యనారాయణ, నుసుము నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

మార్చి 29 @ గుంటూరు
భగత్ సింగ్ 95వ వర్థంతి సందర్భంగా గుంటూరు అన్నదాన సమాజం ఆవరణంలోని
దేశభక్త శ్రీ కొండా వెంకటప్పయ్య ఆడిటోరియం లో నీలం మందారావు మరియు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సభాకార్యక్రమాన్ని నిర్వహించారు. దేశభక్తి సినీ గేయాలాపన తో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో పలువురు వక్తలు మాట్లాడుతూ భారత స్వాతంత్ర్య సమరంలో అత్యంత పిన్న వయస్సులో ప్రాణాలర్పించి, యువతలో దేశభక్తిని రగిలించిన విప్లవ వీరుడు భగత్ సింగ్‌ అని,1931 మార్చి 23న భగత్ సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్‌ల బలిదానాన్ని స్మరించుకుంటూ, వారి తెగింపు, త్యాగనిరతిని దేశం గుర్తుచేసుకుంటుందని ఆ మహనీయుడి త్యాగాలు సదా స్ఫూర్తిదాయకం అని, భగత్ సింగ్ కేవలం 23 ఏళ్ల వయసులో దేశం కోసం ఉరితాడును ముద్దాడిన సాహస యోధుడని, బ్రిటిష్ పాలనను ఎదిరించి, తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన వారి త్యాగాలు నేటి తరానికి ఆదర్శం అని, జరిగిన చారిత్రక సంఘటనలను నేటి తరానికి వివరించి దేశభక్తిని మానవ విలువలను పెంపొందించాలని, ఇటువంటి కార్యక్రమాలు దేశంలోని అన్ని ప్రాంతాలలో నిర్వహించుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ సందర్భంగా పాల్గొన్న అతిధులను జ్ఞాపిక శాలువాతో నిర్వహకులు సత్కరించారు. అనంతరం భగత్ సింగ్ పై ప్రదర్శించిన డాక్యుమెంటరీ చిత్రం ప్రేక్షకులు అందర్నీ ఆలోచింపజేసింది. ఈ కార్యక్రమంలో శ్రీ గుంటూరు అన్నదాన సమాజం కార్యనిర్వహణాధికారి గుణ్ణం శ్రీనివాసరావు, నటనాలయ వ్యవస్థాపక అధ్యక్షులు నీలం మందారావు, హృదయరాజ్, గుంటూరు స్పెషల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కె. శ్రీహరిరావు, గుంటూరు ప్రజా నాట్యమండలి జాతీయ కార్యదర్శి గని, డా. తూములూరి రాజేంద్ర ప్రసాద్, కాళంగి వంశీకృష్ణ, డా. బద్రి పీర్ కుమార్, భైరా శివపోతురాజు, బర్రె సత్యనారాయణ, నుసుము నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.