Saturday, 28 March 2026
  • Home  
  • చిట్వేల్‌లో తెలుగుదేశం పార్టీ 44వ వసంతాల వేడుకలకు సర్వం సిద్ధం
- అన్నమయ్య

చిట్వేల్‌లో తెలుగుదేశం పార్టీ 44వ వసంతాల వేడుకలకు సర్వం సిద్ధం

తెలుగుదేశం పార్టీ స్థాపించి 44 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా, చిట్వేల్ మండల వ్యాప్తంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పార్టీ బలోపేతానికి, సిద్ధాంతాల ప్రచారానికి ఈ వేడుకలను ఒక వేదికగా మార్చుకోవాలని చిట్వేల్ మండల పార్టీ అధ్యక్షుడు కాకర్ల నాగార్జున నాయుడు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఆదివారం (మార్చి 29) ఉదయం నుండి మండలంలోని వివిధ గ్రామాల్లో పసుపు పండుగ వాతావరణం నెలకొననుంది. నాగార్జున నాయుడు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం వేడుకల వివరాలు ఇలా ఉన్నాయి: ఉదయం 7:30 గంటలకు: నాగవరం గ్రామంలో ప్రారంభం. ఉదయం 8:00 గంటలకు నేతివారిపల్లిలో వేడుకలు. ఉదయం 8:15 గంటలకు పెద్దూరు గ్రామంలో జెండా ఆవిష్కరణ.ఉదయం 8:30 గంటలకు జెట్టివారిపల్లిలో ఉత్సాహంగా వేడుకలు.ఉదయం 9:00 గంటలకు చిట్వేల్ లోని ఎన్టీఆర్ నగర్‌లో ప్రధాన వేడుకలు మరియు భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.ఈ సందర్భంగా నాగార్జున నాయుడు మాట్లాడుతూ.. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ నేడు 44వ ఏట అడుగుపెట్టడం గర్వకారణమన్నారు. మండలంలోని ప్రతి కార్యకర్త, నాయకుడు ఈ చారిత్రాత్మక వేడుకల్లో చురుకుగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. పార్టీ జెండాను గ్రామగ్రామానా ఎగురవేసి, మన ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.వేడుకల నేపథ్యంలో మండలంలోని ప్రధాన కూడళ్లు పసుపు తోరణాలు, పార్టీ ఫ్లెక్సీలతో ముస్తాబయ్యాయి. ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించేందుకు అభిమానులు, కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రేపటి కార్యక్రమంతో చిట్వేల్ మండలం పసుపుమయం కానుంది.

తెలుగుదేశం పార్టీ స్థాపించి 44 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా, చిట్వేల్ మండల వ్యాప్తంగా టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పార్టీ బలోపేతానికి, సిద్ధాంతాల ప్రచారానికి ఈ వేడుకలను ఒక వేదికగా మార్చుకోవాలని చిట్వేల్ మండల పార్టీ అధ్యక్షుడు కాకర్ల నాగార్జున నాయుడు కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఆదివారం (మార్చి 29) ఉదయం నుండి మండలంలోని వివిధ గ్రామాల్లో పసుపు పండుగ వాతావరణం నెలకొననుంది. నాగార్జున నాయుడు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం వేడుకల వివరాలు ఇలా ఉన్నాయి:
ఉదయం 7:30 గంటలకు: నాగవరం గ్రామంలో ప్రారంభం.
ఉదయం 8:00 గంటలకు నేతివారిపల్లిలో వేడుకలు.
ఉదయం 8:15 గంటలకు పెద్దూరు గ్రామంలో జెండా ఆవిష్కరణ.ఉదయం 8:30 గంటలకు జెట్టివారిపల్లిలో ఉత్సాహంగా వేడుకలు.ఉదయం 9:00 గంటలకు చిట్వేల్ లోని ఎన్టీఆర్ నగర్‌లో ప్రధాన వేడుకలు మరియు భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.ఈ సందర్భంగా నాగార్జున నాయుడు మాట్లాడుతూ.. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ నేడు 44వ ఏట అడుగుపెట్టడం గర్వకారణమన్నారు. మండలంలోని ప్రతి కార్యకర్త, నాయకుడు ఈ చారిత్రాత్మక వేడుకల్లో చురుకుగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. పార్టీ జెండాను గ్రామగ్రామానా ఎగురవేసి, మన ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు.వేడుకల నేపథ్యంలో మండలంలోని ప్రధాన కూడళ్లు పసుపు తోరణాలు, పార్టీ ఫ్లెక్సీలతో ముస్తాబయ్యాయి. ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించేందుకు అభిమానులు, కార్యకర్తలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రేపటి కార్యక్రమంతో చిట్వేల్ మండలం పసుపుమయం కానుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.