Friday, 27 March 2026
  • Home  
  • ఘనంగా మైఫోర్స్ మహేష్ జన్మదిన వేడుకలు – రక్తదానం, వృక్షార్చన, అన్నదాన కార్యక్రమాలతో సేవా శ్రద్ధ
- శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఘనంగా మైఫోర్స్ మహేష్ జన్మదిన వేడుకలు – రక్తదానం, వృక్షార్చన, అన్నదాన కార్యక్రమాలతో సేవా శ్రద్ధ

ఘనంగా మైఫోర్స్ మహేష్ జన్మదిన వేడుకలు – రక్తదానం, వృక్షార్చన, అన్నదాన కార్యక్రమాలతో సేవా శ జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, ఏపీఐఐసీ డైరెక్టర్ మైఫోర్స్ మహేష్ జన్మదిన వేడుకలు సామాజిక సేవా కార్యక్రమాల మధ్య ఘనంగా నిర్వహించారు. స్థానిక అన్నమయ్య జనసేన పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరంతో ప్రారంభమైన ఈ వేడుకలు కేక్ కటింగ్‌తో సందడిగా మొదలయ్యాయి. ఈ సందర్భంగా సిద్ధమ్మగారి పల్లిలోని ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో “పవన్ అన్న వృక్ష రక్షణ” పేరుతో చెట్లు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం పవన్ కళ్యాణ్జ న్మదినం అయిన సెప్టెంబర్ 2 వరకు కొనసాగుతుందని, మదనపల్లి, తంబళ్లపల్లి, పుంగనూరు, పీలేరు, రాయచోటి నియోజకవర్గాల్లో సుమారు 5000 మొక్కలు నాటడమే లక్ష్యమని మహేష్ తెలిపారు. అలాగే కురపర్తి మరియు చైతన్య అనాధాశ్రమాల్లో పిల్లలు, వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. మంజునాథ స్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు. చిత్తూరు బస్టాండ్ మరియు నీరుగుట్టువారిపల్లి ప్రాంతాల్లో కూడా కేక్ కటింగ్, బాణాసంచా పేల్చడం, అన్నదాన కార్యక్రమాలు ఉత్సాహంగా జరిగాయి. ఈ కార్యక్రమాల్లో జనసేన పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు అమర్ నారాయణ, మహిళా నాయకులు శోభ, జయ భవ్య, సీనియర్ నాయకులు సందీప్ రెడ్డి, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వందలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, అభిమానులు పాల్గొని మహేష్ జన్మదిన వేడుకలను సేవామూర్తిగా నిర్వహించారు.

ఘనంగా మైఫోర్స్ మహేష్ జన్మదిన వేడుకలు – రక్తదానం, వృక్షార్చన, అన్నదాన కార్యక్రమాలతో సేవా శ
జనసేన పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, ఏపీఐఐసీ డైరెక్టర్ మైఫోర్స్ మహేష్ జన్మదిన వేడుకలు సామాజిక సేవా కార్యక్రమాల మధ్య ఘనంగా నిర్వహించారు. స్థానిక అన్నమయ్య జనసేన పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరంతో ప్రారంభమైన ఈ వేడుకలు కేక్ కటింగ్‌తో సందడిగా మొదలయ్యాయి.
ఈ సందర్భంగా సిద్ధమ్మగారి పల్లిలోని ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో “పవన్ అన్న వృక్ష రక్షణ” పేరుతో చెట్లు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం పవన్ కళ్యాణ్జ న్మదినం అయిన సెప్టెంబర్ 2 వరకు కొనసాగుతుందని, మదనపల్లి, తంబళ్లపల్లి, పుంగనూరు, పీలేరు, రాయచోటి నియోజకవర్గాల్లో సుమారు 5000 మొక్కలు నాటడమే లక్ష్యమని మహేష్ తెలిపారు.
అలాగే కురపర్తి మరియు చైతన్య అనాధాశ్రమాల్లో పిల్లలు, వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. మంజునాథ స్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేశారు.
చిత్తూరు బస్టాండ్ మరియు నీరుగుట్టువారిపల్లి ప్రాంతాల్లో కూడా కేక్ కటింగ్, బాణాసంచా పేల్చడం, అన్నదాన కార్యక్రమాలు ఉత్సాహంగా జరిగాయి.
ఈ కార్యక్రమాల్లో జనసేన పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు అమర్ నారాయణ, మహిళా నాయకులు శోభ, జయ భవ్య, సీనియర్ నాయకులు సందీప్ రెడ్డి, రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వందలాది మంది పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, అభిమానులు పాల్గొని మహేష్ జన్మదిన వేడుకలను సేవామూర్తిగా నిర్వహించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.