పొద్దుటూరులోని స్థానిక గీతాశ్రమం వీధిలో శుక్రవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
ఆశ్రమానికి చెందిన ఇంటిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు అంటుకున్నాయి. పక్కనున్న హోటల్కు కూడా వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. చెక్క దంతెలతో నిర్మించిన ఇల్లు, వస్తువులు పూర్తిగా కాలిపోయాయని ఫైర్ ఆఫీసర్ బసివిరెడ్డి తెలిపారు. స్థానిక ASP విభుకృష్ణ అక్కడికి వచ్చి పరిశీలించారు.
Uploaded Video:


