తాళ్లపూడి,(పున్నమి ప్రతినిధి,తూర్పుగోదావరి) :
తాళ్లపూడి మండలం ప్రక్కిలంకలోని రావిపాటి ఫంక్షన్ హాల్ సమీపంలో ఉన్న శ్రీనివాస స్మార్ట్ హాస్పిటల్ రెండు సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకుని మూడవ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా హాస్పిటల్ ప్రాంగణంలో వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా హాస్పిటల్ అధినేత మూర్తి మాట్లాడుతూ, హాస్పిటల్ స్థాపించినప్పటి నుంచి ప్రజలకు వివిధ అనారోగ్య సమస్యలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తూ, ఎక్కడా రాజీ పడకుండా రోగులకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య సేవలు అందించడం తమ లక్ష్యమని పేర్కొన్నారు.
అనారోగ్యంతో బాధపడుతున్న రోగులపై ఆర్థిక భారం తగ్గించే విధంగా సేవలు అందిస్తున్నామని, హాస్పిటల్ 365 రోజులు 24 గంటలు నిరంతర సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ సేవలందించడంలో హాస్పిటల్ సిబ్బంది అంకితభావంతో పనిచేస్తున్నారని కొనియాడారు.
హాస్పిటల్ అభివృద్ధికి సహకరించిన ప్రజలకు, గ్రామీణ వైద్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ చరణ్, డాక్టర్ భవ్య, ఆర్ఎంపీలు మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.

ప్రక్కిలంకలో శ్రీనివాస స్మార్ట్ హాస్పిటల్ వార్షికోత్సవం – నాణ్యమైన వైద్య సేవలతో ముందుకు
తాళ్లపూడి,(పున్నమి ప్రతినిధి,తూర్పుగోదావరి) : తాళ్లపూడి మండలం ప్రక్కిలంకలోని రావిపాటి ఫంక్షన్ హాల్ సమీపంలో ఉన్న శ్రీనివాస స్మార్ట్ హాస్పిటల్ రెండు సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకుని మూడవ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా హాస్పిటల్ ప్రాంగణంలో వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ అధినేత మూర్తి మాట్లాడుతూ, హాస్పిటల్ స్థాపించినప్పటి నుంచి ప్రజలకు వివిధ అనారోగ్య సమస్యలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో ఎదురయ్యే సవాళ్లను అధిగమిస్తూ, ఎక్కడా రాజీ పడకుండా రోగులకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన వైద్య సేవలు అందించడం తమ లక్ష్యమని పేర్కొన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న రోగులపై ఆర్థిక భారం తగ్గించే విధంగా సేవలు అందిస్తున్నామని, హాస్పిటల్ 365 రోజులు 24 గంటలు నిరంతర సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఈ సేవలందించడంలో హాస్పిటల్ సిబ్బంది అంకితభావంతో పనిచేస్తున్నారని కొనియాడారు. హాస్పిటల్ అభివృద్ధికి సహకరించిన ప్రజలకు, గ్రామీణ వైద్యులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చరణ్, డాక్టర్ భవ్య, ఆర్ఎంపీలు మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.

