Thursday, 19 March 2026
  • Home  
  • రేపు. ఖమ్మం జిల్లా బీజేపీ. ఆధ్వర్యంలో ధర్నా కి నెల్లూరు కోటేశ్వరరావు పిలుపు
- ఖమ్మం

రేపు. ఖమ్మం జిల్లా బీజేపీ. ఆధ్వర్యంలో ధర్నా కి నెల్లూరు కోటేశ్వరరావు పిలుపు

ఖమ్మం, మార్చి (పున్నమి జిల్లా ఇంచార్జి ) బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రేపు శుక్రవారం ఉదయం 10 గంటలకు ఖమ్మం కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని ఆరోపిస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన నేపథ్యంలో ప్రజా సమస్యలపై నిలదీయడానికి ఈ ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి మండలం నుంచి అధిక సంఖ్యలో కార్యకర్తలు హాజరుకావాలని కోరారు. అలాగే మండల అధ్యక్షులు తమ పరిధిలోని అన్ని నాయకులు, కార్యకర్తలకు సమాచారం అందించి, కార్యక్రమంలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ ధర్నా కార్యక్రమం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ప్రజల ముందుంచి, తమ నిరసనను తెలియజేయనున్నట్లు బీజేపీ నాయకులు తెలిపారు.

ఖమ్మం, మార్చి
(పున్నమి జిల్లా ఇంచార్జి )

బీజేపీ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు రేపు శుక్రవారం ఉదయం 10 గంటలకు ఖమ్మం కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని ఆరోపిస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిన నేపథ్యంలో ప్రజా సమస్యలపై నిలదీయడానికి ఈ ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి మండలం నుంచి అధిక సంఖ్యలో కార్యకర్తలు హాజరుకావాలని కోరారు.

అలాగే మండల అధ్యక్షులు తమ పరిధిలోని అన్ని నాయకులు, కార్యకర్తలకు సమాచారం అందించి, కార్యక్రమంలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ ధర్నా కార్యక్రమం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని ప్రజల ముందుంచి, తమ నిరసనను తెలియజేయనున్నట్లు బీజేపీ నాయకులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.