తొట్టంబేడు, మార్చి 16 (పున్నమి న్యూస్): ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా తొట్టంబేడు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం నాడు ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) పి. సురేంద్రనాథ్, డిప్యూటీ ఎంపీడీఓ (ఎస్‌జిఎస్‌డబ్ల్యూ) భార్గవ సత్యం, కార్యాలయ సిబ్బంది పాల్గొని పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు ప్రజల కోసం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం సాధించాలనే లక్ష్యంతో పొట్టి శ్రీరాములు చేపట్టిన నిరాహార దీక్ష చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందన్నారు. ఆయన త్యాగం ఫలితంగానే తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందని అమరజీవి పొట్టి శ్రీరాములు చూపిన త్యాగస్ఫూర్తి, సేవాభావం నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తాయని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది ఆయన సేవలను స్మరించుకుని ఘనంగా నివాళులు అర్పించారు.

తొట్టంబేడు ఎంపీడీఓ కార్యాలయంలో ఘనంగాఅమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి