జనసేన పార్టీ ఉద్యమ సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా
జనసేన పార్టీ పటిష్టత కోసం చేపట్టిన క్రియాశీల “ఉద్యమ సభ్యత్వ నమోదు” కార్యక్రమంలో భాగంగా ప్రత్తిపాడు మండలం లాంపకలోవా గ్రామంలో ప్రజా చైతన్య ఉద్యమ సభ్యత్వ శిబిరాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ ప్రజలను కలుసుకుని ఉద్యమ సభ్యత్వ కార్యక్రమాన్ని చేపట్టారు.
జనసేన పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాలు ప్రజలకు వివరించి సభ్యత్వం పొందాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు మంచి స్పందన తెలుపుతూ పెద్ద ఎత్తున సభ్యత్వం నమోదు చేసుకున్నారు.
పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని నాయకులు ఈ సందర్భంగా కోరారు.


