జలదంకి మండలం రామవరప్పాడు ఎస్టీ కాలనీలో అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న యాకసిరి నాగేంద్రమ్మ కుటుంబానికి రామవరప్పాడు టీడీపీ నాయకులు అండగా నిలిచారు. విషయం తెలిసిన వెంటనే గ్రామానికి చేరుకున్న నాయకులు నాగేంద్రమ్మను పరామర్శించి కుటుంబానికి ధైర్యం చెప్పారు.
టీడీపీ సీనియర్ నాయకులు కంచర్ల రామచంద్రయ్య, వర్ధినేని మురళి నాయుడు నాగేంద్రమ్మ ఇంటికి వెళ్లి ఆమె ఆరోగ్య పరిస్థితి, కుటుంబ ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ యువనాయకుడు వర్ధినేని వెంకట వినయ్ కుమార్ చౌదరి తన సొంత నిధుల నుండి రూ.10,000 ఆర్థిక సహాయం అందించి తక్షణ సహకారం అందించారు. ప్రజల కష్టాల్లో ముందుండటం తమ బాధ్యత అని వారు తెలిపారు.
అలాగే నాగేంద్రమ్మ కుటుంబానికి వర్తించే అన్ని ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని, నెల్లూరు పార్లమెంట్ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆశీస్సులతో మరియు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ బాబు ఆధ్వర్యంలో సహాయ సహకారాలు అందిస్తామని నాయకులు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో, యువనేత నారా లోకేష్ మార్గదర్శకత్వంలో ప్రజాసేవను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వర్ధినేని హరిబాబు, సెట్టిపల్లి ప్రసాద్, మిరియం సురేష్, రామవరప్పాడు గ్రామ టీడీపీ కమిటీ ఉపాధ్యక్షుడు మాకినేని ప్రసాద్, ఎస్టీ కాలనీ 8వ వార్డు సభ్యురాలు తిరువీధుల కవిత భర్త తిరువీధుల శ్రీనివాసులు, నీలం పెద్ద మాలకొండయ్య తదితర టీడీపీ నాయకులు పాల్గొన్నారు.



