ఉదయగిరి నియోజకవర్గానికి చెందిన జనసేన పార్టీ కార్యక్రమ కమిటీ రాష్ట్ర కార్యదర్శి, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ శ్రీ కొట్టే వెంకటేశ్వర్లు గారు మరియు శ్రీమతి కొట్టే స్వర్ణలత అమ్మ గారు, అనారోగ్యంతో ఉన్న చిన్నా జనసేన తనయుడిని పరామర్శించారు. కుటుంబ సభ్యులను ఆత్మీయంగా పరామర్శిస్తూ ధైర్యం చెప్పారు. బాలుడు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ అవసరమైన సహాయం అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు కూడా హాజరై కుటుంబానికి ధైర్యం చెప్పారు. జనసేన పార్టీ ఎల్లప్పుడూ తన కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలుస్తుందని నాయకులు పేర్కొన్నారు.


