శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, మార్చి 10: శ్రీకాళహస్తి క్షేత్రం ఆధ్యాత్మిక చైతన్యంతో పులకించింది. శృంగేరి శారదా పీఠాధిపతులు జగద్గురు శ్రీశ్రీశ్రీ భారతీ తీర్థ మహాస్వామీజీ, ఉత్తర పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ మహాస్వామీజీల రాకతో ఆలయ పరిసరాలు వేదమంత్రోచ్ఛారణలతో మారుమోగాయి. శ్రీ జ్ఞానప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనార్థం విచ్చేసిన ఉభయ పీఠాధిపతులకు శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి, బిజెపి సీనియర్ నాయకులు కోలా ఆనంద్, ఆలయ పాలకమండలి అధ్యక్షులు కొట్టే సాయి ప్రసాద్ ఘనంగా స్వాగతం పలికారు. ఆలయ రాజగోపురం వద్దకు చేరుకున్న పీఠాధిపతులకు అధికారులు, నేతలు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ గర్భాలయంలో స్వామి, అమ్మవార్లకు నిర్వహించిన ప్రత్యేక పూజల్లో పీఠాధిపతులు పాల్గొన్నారు. పీఠాధిపతుల పర్యటన దృష్ట్యా దేవస్థానం తరపున అన్ని రకాల ముందస్తు ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, కోలా ఆనంద్, సాయి ప్రసాద్‌లు పీఠాధిపతులను దర్శించుకుని, వారి ఆశీర్వాదాలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. శృంగేరి జగద్గురువుల పాదస్పర్శతో శ్రీకాళహస్తి క్షేత్రం పునీతమైందని, నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని వారి ఆశీస్సులు కోరినట్లు తెలిపారు. కోలా ఆనంద్ మాట్లాడుతూ పీఠాధిపతుల రాక క్షేత్రానికి మరింత ఆధ్యాత్మిక శోభను తెచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

శ్రీకాళహస్తిలో శృంగేరి పీఠాధిపతుల ఆధ్యాత్మిక సందడి-ఘనస్వాగతం పలికిన ఎమ్మెల్యేబొజ్జల