ఖమ్మం ఫిబ్రవరి
(పున్నమి జిల్లా ఇంచార్జి )
కలెక్టరేట్ సమీపంలోని వెలుగుమట్ల ఇండ్ల కూల్చివేత వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాధితులను పరామర్శించేందుకు వచ్చిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామా రావు పర్యటన అనంతరం, కూల్చివేతల్లో ప్రధాన పాత్ర పోషించినట్లు భావిస్తున్న ఖమ్మం ఆర్డీవో నరసింహారావును అర్ధాంతరంగా బదిలీ చేశారు.
ఖమ్మం ఆర్డీవోగా ఉన్న నరసింహారావును మెట్‌పల్లికి బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
మెట్‌పల్లిలో ప్రస్తుతం పనిచేస్తున్న ఆర్డీవో శ్రీనివాసరావును ఖమ్మం ఆర్డీవోగా నియమించారు.
అనుమానాలకు తావు
వెలుగుమట్ల కూల్చివేతలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో
కూల్చివేతల బాధ్యతను అధికారులపై నెట్టే ప్రయత్నంలో భాగంగానే ఈ బదిలీ జరిగిందా?
రాజకీయ ఒత్తిళ్ల నేపథ్యంలో తీసుకున్న నిర్ణయమా
అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
కేటీఆర్ బాధితులను పరామర్శించిన వెంటనే ఈ బదిలీ జరగడం మరింత రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. అధికార యంత్రాంగం పాత్రపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఈ పరిణామం కేసుకు కొత్త మలుపు తిప్పింది.


