ఖమ్మం ఫిబ్రవరి
(పున్నమి జిల్లా ఇంచార్జి )
నాగర్‌కర్నూల్ జిల్లా లోని కొమురెల్లి మల్లన్న దేవస్థానం జాతర సందర్భంగా రజక కుటుంబంపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనలో రెండు నెలల పసికందు మృతి చెందడం అత్యంత విషాదకరమని పేర్కొన్నారు.
మల్లన్న దర్శనం కోసం వెళ్లిన చాకలి చంద్రకళ కుటుంబాన్ని కులం పేరుతో దూషిస్తూ, ఆలయంలోకి ప్రవేశం నిరాకరించి కొందరు అగ్రకుల వ్యక్తులు అడ్డుకున్నారని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాట, దాడిలో కుటుంబ సభ్యులు గాయపడగా, రెండు నెలల శిశువు ప్రాణాలు కోల్పోవడం సమాజం తలదించుకోవాల్సిన ఘటన అని ఆవేదన వ్యక్తం చేశారు.
కుల వివక్షతో వ్యవహరించడం, దేవాలయంలోకి ప్రవేశం నిరోధించడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్న వెంకటనారాయణ, బాధ్యులపై వెంటనే హత్య కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటనపై నిరసనలు వ్యక్తమవుతున్నాయని, బాధిత కుటుంబానికి న్యాయం చేయడం ప్రభుత్వం బాధ్యత అని అన్నారు.
ఇలాంటి అమానుష ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తిసుకోవాలని ధనియాకుల వెంకట్ నారాయణ కోరారు.



