Thursday, 14 May 2026
  • Home  
  • ఆంధ్రప్రదేశ్ సగర (ఉప్పర) వెల్ఫేర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమితులైన ఉప్పరి సురేష్ కుమార్ కి ఘన సన్మానం*
- Blog

ఆంధ్రప్రదేశ్ సగర (ఉప్పర) వెల్ఫేర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా నియమితులైన ఉప్పరి సురేష్ కుమార్ కి ఘన సన్మానం*

నంద్యాల: ఆంధ్రప్రదేశ్ సగర (ఉప్పర) వెల్ఫేర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా నంద్యాల 8వ వార్డుకు చెందిన ఉప్పరి సురేష్ కుమార్ నియమితులైన శుభ సందర్భంగా, నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.ఎమ్.డి. ఫిరోజ్ హాజరయ్యారు. అనంతరం కొత్తగా డైరెక్టర్‌గా నియమితులైన ఉప్పరి సురేష్ కుమార్ ని శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ సురేష్ కుమార్ నియామకం సగర (ఉప్పర) వర్గానికి మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుందని, ఆయన ఈ పదవి ద్వారా తమ వర్గం సంక్షేమానికి, అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పార్టీ ఎల్లప్పుడూ వెనుకబడిన వర్గాలకు అండగా ఉంటుందని ఆయన తెలియజేశారు. డైరెక్టర్ ఉప్పరి సురేష్ కుమార్ ఈ సందర్భంగా పార్టీ పెద్దలకు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ కి, నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ కి, టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ కి, కృతజ్ఞతలు తెలియజేస్తూ, తనకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహిస్తానని, సగర వర్గం అభ్యున్నతికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలియజేశారు ఈ సన్మాన కార్యక్రమంలో సుబ్రి , షేక్ మొహమ్మద్ రఫీ (మున్నా) , నాగేశ్వరరావు , ఎబినేజర్ , కృపాకర్ , బింగుమల్లె శ్యాంసుందర్ గుప్తా , జోసెఫ్ , మరాఠీ సూరి , అక్బర్ , శ్రీనివాసులు , ప్రదీప్ రెడ్డి , డాక్టర్ గురు ప్రసాద్ , చిలకల చెన్నయ్య , హరుణ్ బేగ్ మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు సగర సంఘం ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

నంద్యాల: ఆంధ్రప్రదేశ్ సగర (ఉప్పర) వెల్ఫేర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్‌గా నంద్యాల 8వ వార్డుకు చెందిన ఉప్పరి సురేష్ కుమార్ నియమితులైన శుభ సందర్భంగా, నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.ఎమ్.డి. ఫిరోజ్ హాజరయ్యారు. అనంతరం కొత్తగా డైరెక్టర్‌గా నియమితులైన ఉప్పరి సురేష్ కుమార్ ని శాలువాతో సన్మానించి అభినందించారు.

ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ సురేష్ కుమార్ నియామకం సగర (ఉప్పర) వర్గానికి మరింత ప్రోత్సాహాన్ని ఇస్తుందని, ఆయన ఈ పదవి ద్వారా తమ వర్గం సంక్షేమానికి, అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పార్టీ ఎల్లప్పుడూ వెనుకబడిన వర్గాలకు అండగా ఉంటుందని ఆయన తెలియజేశారు.

డైరెక్టర్ ఉప్పరి సురేష్ కుమార్ ఈ సందర్భంగా పార్టీ పెద్దలకు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కి మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ కి, నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ కి, టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ కి, కృతజ్ఞతలు తెలియజేస్తూ, తనకు అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నిర్వహిస్తానని, సగర వర్గం అభ్యున్నతికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలియజేశారు
ఈ సన్మాన కార్యక్రమంలో సుబ్రి , షేక్ మొహమ్మద్ రఫీ (మున్నా) , నాగేశ్వరరావు , ఎబినేజర్ , కృపాకర్ , బింగుమల్లె శ్యాంసుందర్ గుప్తా , జోసెఫ్ , మరాఠీ సూరి , అక్బర్ , శ్రీనివాసులు , ప్రదీప్ రెడ్డి , డాక్టర్ గురు ప్రసాద్ , చిలకల చెన్నయ్య , హరుణ్ బేగ్ మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు సగర సంఘం ప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.