Wednesday, 25 February 2026
  • Home  
  • రేపు కేటీఆర్ ఖమ్మం పర్యటన
- ఖమ్మం

రేపు కేటీఆర్ ఖమ్మం పర్యటన

ఖమ్మం, ఫిబ్రవరి (పున్నమి జిల్లా ఇంచార్జి ) భారత రాష్ట్ర సమితి కార్యనిర్వహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) గురువారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. వెలగుమట్ల భూదాన్ నిర్వాసితులకు మద్దతుగా ఆయన అక్కడికి వెళ్లి బాధితులను పరామర్శించనున్నారు. ఇటీవల అధికార కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చర్యల నేపథ్యంలో 22 రోజుల పాటు జైలు జీవితం గడిపి విడుదలైన బీఆర్ఎస్ ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజును కూడా కేటీఆర్ ఈ పర్యటనలో పరామర్శించనున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశముంది. కేటీఆర్ ఖమ్మం పర్యటనను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, శాసన మండలి సభ్యుడు తాత మధు, నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని పర్యటనను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.

ఖమ్మం, ఫిబ్రవరి
(పున్నమి జిల్లా ఇంచార్జి )
భారత రాష్ట్ర సమితి కార్యనిర్వహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) గురువారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. వెలగుమట్ల భూదాన్ నిర్వాసితులకు మద్దతుగా ఆయన అక్కడికి వెళ్లి బాధితులను పరామర్శించనున్నారు.

ఇటీవల అధికార కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చర్యల నేపథ్యంలో 22 రోజుల పాటు జైలు జీవితం గడిపి విడుదలైన బీఆర్ఎస్ ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజును కూడా కేటీఆర్ ఈ పర్యటనలో పరామర్శించనున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశముంది.

కేటీఆర్ ఖమ్మం పర్యటనను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, శాసన మండలి సభ్యుడు తాత మధు, నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని పర్యటనను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.