అనకాపల్లి జిల్లా ఫిబ్రవరి 21 పున్నమి న్యూస్ ప్రతినిధి (ఆనంద్) : ఎలమంచిలిలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో ఎమ్మెల్యే సుందరపు విజయకుమార్ 27 మంది బాధితులకు రూ.13 లక్షల 76 వేల సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. జడ్పీ గెస్ట్ హౌస్‌లోని ఎమ్మెల్యే ఛాంబర్లో శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, పేదల సమస్యలు జనవాణి ద్వారా తెలియజేసిన వెంటనే పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజల శ్రేయస్సే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.






