శ్రీకాళహస్తి, పిబ్రవరి 04, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యుల బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్, సిడాప్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలోని విక్రమ్ డిగ్రీ కళాశాల మెగా జాబ్ మేళా నిర్వహించడం జరిగినది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే ధ్యేయంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి నిరుద్యోగుల నుండి విశేష స్పందన లభించి విజయవంతమైంది. ఈ జాబ్ మేళా ను ఉద్దేశించి తిరుపతి జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి ఆర్ లోకనాథం మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి 20 లక్షలు ఉద్యోగాలలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు జాబ్ మేళా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. ఈ జాబ్ మేళాలో సెలెక్ట్ అయిన వారికి 13000/- నుంచి 20000/- వరకు కనీస వేతన సదుపాయం కలదని తెలియజేశారు అదేవిధంగా ఉద్యోగంలో సెలెక్ట్ కాని వారికి త్వరలో నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా శ్రీకాళహస్తి నియోజకవర్గం లో ఎస్ వి ఏ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల, స్కిల్ హబ్ ఏర్పాటు చేశామని అందులో ఉచిత శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పించడం నిరంతరం జరుగుతున్నదని ఆయన పేర్కొన్నారు. అనంతరం విక్రమ్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్,పట్టాభి మాట్లాడుతూ.. చదువుకొని ఖాళీగా ఉన్నటువంటి వారికి, ఫైనల్ ఇయర్ చదువుతున్నటువంటి వారికి ఇలాంటి జాబ్ మేళా జరగడం వల్ల ఉద్యోగ అవకాశాలు పొంది ఆర్థికంగా, సాంఘికంగా వారి కుటుంబానికి అండగా ఉంటూ వారు ఎదుగుదలకి చాలా మంచిగా దోహదపడతారని జాబ్ మేళాకు హాజరైన యువతీ యువకులకు ఆల్ ది బెస్ట్ తెలియజేశారు. ఈ జాబ్ మేళాకి 12 బహుళ జాతీయ కంపెనీలు మెగా జాబ్ మేళాకు హాజరు అవ్వగా 374 మంది హాజరవుగా, 168 మంది వివిధ కంపెనీలకు ఉద్యోగ (Select)అర్హత పొందడం జరిగినది అలాగే 21 మంది ఇంటర్వ్యూకు షార్ట్ లిస్ట్ అవడం జరిగినది. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా ఏపీ ఎస్ ఎస్ డి సి సిబ్బంది, విక్రమ్ డిగ్రీ కళాశాల సిబ్బంది పాల్గొనడం జరిగినది.

నిరుద్యోగులకు వరం శ్రీకాళహస్తిలో మెగా జాబ్ మేళా-జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారి