గత వైసీపీ ప్రభుత్వం ప్రజలను ఆర్థికపరం గా దోచుకోవడమే కాకుండా తిరుమల లడ్డు ప్రసాదం లో కల్తీ నెయ్యి కలిపి ప్రజల ఆరోగ్యాలతో కూడా చెలగాటం ఆడిందని తీవ్ర విమర్శలు చేశారు పెడన MLA కాగిత కృష్ణప్రసాద్.
బంటుమిల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మీడియా తో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాం లో లడ్డు ప్రసాదం లో 1.6కోట్ల కిలోల కల్తీ నెయ్యి కలిపి 235 కోట్ల అవినీతి చేయడమే కాకుండా ప్రజల ఆరోగ్యాలతో తీవ్ర చెలగాటం ఆడారని, దేశ వ్యాప్తం గా శ్రీవారి భక్తుల మనోభావాలతో ఆట్లాడుకున్నారని ఆయన తెలియచేసారు.ఇప్పటికైనా జగన్మోహనరెడ్డి స్వామి వారిని వేడుకొని క్షమాపణ కోరాలని, ఆయన హితవు పలికారు.
అలాగే వైసీపీ నాయకులు తిరుమల కొండ పై కాలీ బాటిల్స్ తీసుకువెళ్లి కొండ పై ఎదో జరిగిపోతుందని, ఇంతకు ముందులా ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని అవన్నీ ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదని ఆయన తెలియపరిచారు.

కల్తీ నెయ్యి కలిపి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడిన వైసిపి :పెడన MLA కాగితకృష్ణప్రసాద్
గత వైసీపీ ప్రభుత్వం ప్రజలను ఆర్థికపరం గా దోచుకోవడమే కాకుండా తిరుమల లడ్డు ప్రసాదం లో కల్తీ నెయ్యి కలిపి ప్రజల ఆరోగ్యాలతో కూడా చెలగాటం ఆడిందని తీవ్ర విమర్శలు చేశారు పెడన MLA కాగిత కృష్ణప్రసాద్. బంటుమిల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మీడియా తో మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాం లో లడ్డు ప్రసాదం లో 1.6కోట్ల కిలోల కల్తీ నెయ్యి కలిపి 235 కోట్ల అవినీతి చేయడమే కాకుండా ప్రజల ఆరోగ్యాలతో తీవ్ర చెలగాటం ఆడారని, దేశ వ్యాప్తం గా శ్రీవారి భక్తుల మనోభావాలతో ఆట్లాడుకున్నారని ఆయన తెలియచేసారు.ఇప్పటికైనా జగన్మోహనరెడ్డి స్వామి వారిని వేడుకొని క్షమాపణ కోరాలని, ఆయన హితవు పలికారు. అలాగే వైసీపీ నాయకులు తిరుమల కొండ పై కాలీ బాటిల్స్ తీసుకువెళ్లి కొండ పై ఎదో జరిగిపోతుందని, ఇంతకు ముందులా ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని అవన్నీ ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదని ఆయన తెలియపరిచారు.

