ముస్తాబాద్/పున్నమి ప్రతినిధి/ జనవరి
ముస్తాబాద్ మండలం నామపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ శాఖ అధ్యక్షులు తాడేపు అనిల్ గారి పుట్టినరోజు సందర్భంగా కేటీఆర్ సేన ఆధ్వర్యంలో శుభాకాంక్షల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేటీఆర్ సేన రాష్ట్ర అధ్యక్షులు మెంగని మనోహర్ గారు హాజరై అనిల్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ యూత్ మండల అధ్యక్షులు శీలం స్వామి, మానవ హక్కుల జిల్లా అధ్యక్షులు మహమ్మద్ జహంగీర్, కేటీఆర్ సేన ముస్తాబాద్ మండల అధ్యక్షులు వంగూరి దిలీప్, మైనార్టీ సెల్ అధ్యక్షులు వకీల్, గ్రామ శాఖ ఉపాధ్యక్షులు బాలచంద్రం, ఏఎంసీ మాజీ డైరెక్టర్ సురేష్, కేటీఆర్ సేన జిల్లా సోషల్ మీడియా ఇంచార్జ్ సురోజుల నరేంద్ర చారి, కేటీఆర్ సేన ఉపాధ్యక్షులు గుణాల రాజు పాల్గొన్నారు.
అదేవిధంగా సీనియర్ నాయకులు శివరాత్రి రాజు, భూస శ్రీశైలం, నిమ్మ విజయ్, మెరుగు పవన్, షేక్ షఫీ, తప్పెట రాజబాబు, జాలగం రాజలింగం, గుగ్గిల బన్నీ, జంగిటి మల్లేశం, శేఖర్ తదితరులు పాల్గొని తాడేపు అనిల్ గారికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, పార్టీ బలోపేతానికి అనిల్ గారు చేస్తున్న సేవలు అభినందనీయమని పేర్కొన్నారు.



