Monday, 23 March 2026
  • Home  
  • తెలుగు ప్రజల గుండె చప్పుడు అన్న ఎన్టీఆర్ గారు
- ఎన్ టి ఆర్ జిల్లా

తెలుగు ప్రజల గుండె చప్పుడు అన్న ఎన్టీఆర్ గారు

తెలుగు ప్రజల గుండె చప్పుడు అన్న ఎన్టీఆర్ గారు. తెలుగుదేశం పార్టీ నాయకుల కర్మాగారం. -మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు. గొల్లపూడిలో ఘనంగా ఎన్టీఆర్ గారి 30వ వర్ధంతి. ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్, పున్నమి న్యూస్ ప్రతినిధి ఎన్టీఆర్ జిల్లా మైలవరం జనవరి తెలుగు ప్రజల గుండె చప్పుడు అన్న ఎన్టీఆర్ గారు అని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు పేర్కొన్నారు. విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపూడిలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్న ఎన్టీఆర్ గారి నిలువెత్తు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పేదలకు పండ్లు పంపిణీ చేశారు. స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ మరణం లేని కారణ జన్ముడు అన్న ఎన్టీఆర్ గారు అని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ రాజకీయ నేతల కర్మాగారం అన్నారు. కిలో రెండు రూపాయల బియ్యం, సామాజిక భద్రతా పింఛన్లు, పక్కా ఇళ్ల నిర్మాణం, రైతుకు విద్యుత్, మండల వ్యవస్థతో స్థానిక స్వపరిపాలన, ఆడబిడ్డలకు ఆస్తిలో హక్కు, రాయలసీమకు సాగు, తాగునీటి ప్రాజెక్టులు లాంటి అనితరసాధ్యమైన సంక్షేమ అభివృద్ధి పథకాలతో చరిత్ర గతిని మార్చిన ఆ మహనీయుని సేవలు మనకు ఆదర్శమన్నారు. అన్న ఎన్టీఆర్ గారి ఆశయాలు సాధిస్తామన్నారు. ప్రతిఒక్కరికీ ఎన్టీఆర్ గారు ఆదర్శనీయుడన్నారు. జోహార్ అన్న ఎన్టీఆర్ గారు అంటూ నినదించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనార్టీల అభ్యున్నతికి, సంక్షేమానికి పెద్దపీట వేసింది తెలుగుదేశం పార్టీ అన్నారు. ఎన్టీఆర్ గారి అడుగుజాడల్లో నడుస్తూ అన్నగారి ఆశయాల సాధనకు సీఎం చంద్రబాబు గారు, మంత్రి నారా లోకేష్ గారు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం గొల్లపూడిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూడా ఎన్టీఆర్ గారి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు నియోజకవర్గంలోని టీడీపీ కుటుంబ సభ్యులతో మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎన్టీఆర్ గారి అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

తెలుగు ప్రజల గుండె చప్పుడు అన్న ఎన్టీఆర్ గారు.

తెలుగుదేశం పార్టీ నాయకుల కర్మాగారం.

-మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు.

గొల్లపూడిలో ఘనంగా ఎన్టీఆర్ గారి 30వ వర్ధంతి.

ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్, పున్నమి న్యూస్ ప్రతినిధి ఎన్టీఆర్ జిల్లా మైలవరం జనవరి

తెలుగు ప్రజల గుండె చప్పుడు అన్న ఎన్టీఆర్ గారు అని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు గారు పేర్కొన్నారు. విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపూడిలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్న ఎన్టీఆర్ గారి నిలువెత్తు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పేదలకు పండ్లు పంపిణీ చేశారు.

స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు మాట్లాడుతూ మరణం లేని కారణ జన్ముడు అన్న ఎన్టీఆర్ గారు అని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ రాజకీయ నేతల కర్మాగారం అన్నారు. కిలో రెండు రూపాయల బియ్యం, సామాజిక భద్రతా పింఛన్లు, పక్కా ఇళ్ల నిర్మాణం, రైతుకు విద్యుత్, మండల వ్యవస్థతో స్థానిక స్వపరిపాలన, ఆడబిడ్డలకు ఆస్తిలో హక్కు, రాయలసీమకు సాగు, తాగునీటి ప్రాజెక్టులు లాంటి అనితరసాధ్యమైన సంక్షేమ అభివృద్ధి పథకాలతో చరిత్ర గతిని మార్చిన ఆ మహనీయుని సేవలు మనకు ఆదర్శమన్నారు.

అన్న ఎన్టీఆర్ గారి ఆశయాలు సాధిస్తామన్నారు. ప్రతిఒక్కరికీ ఎన్టీఆర్ గారు ఆదర్శనీయుడన్నారు. జోహార్ అన్న ఎన్టీఆర్ గారు అంటూ నినదించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనార్టీల అభ్యున్నతికి, సంక్షేమానికి పెద్దపీట వేసింది తెలుగుదేశం పార్టీ అన్నారు. ఎన్టీఆర్ గారి అడుగుజాడల్లో నడుస్తూ అన్నగారి ఆశయాల సాధనకు సీఎం చంద్రబాబు గారు, మంత్రి నారా లోకేష్ గారు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.

అనంతరం గొల్లపూడిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూడా ఎన్టీఆర్ గారి వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు గారు నియోజకవర్గంలోని టీడీపీ కుటుంబ సభ్యులతో మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎన్టీఆర్ గారి అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.