Monday, 23 March 2026
  • Home  
  • ప్రవాసుల భాగస్వామ్యం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి గ్లోబల్ శక్తి.
- E-పేపర్

ప్రవాసుల భాగస్వామ్యం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి గ్లోబల్ శక్తి.

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం గోపాలపురం మండలం పున్నమి సీనియర్ రిపోర్టర్ 9989086083. ప్రవాస భారతీయుల దినోత్సవం *(జనవరి 9)* సందర్భంగా మంత్రి వర్యులు కందుల దుర్గేష్ గారు *ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రవాస సోదర సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.* ప్రవాస భారతీయులు కేవలం విదేశాల్లో నివసించే వారు మాత్రమే కాక, *ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్లుగా నిలుస్తున్న శక్తి అని ఆయన అన్నారు.* పెట్టుబడులు, నైపుణ్యాల మార్పిడి, విద్య, వైద్యం, సాంకేతికత, పరిశ్రమల రంగాల్లో ప్రవాసుల అనుభవం రాష్ట్ర పురోగతికి బలమైన పునాదిగా మారుతోందని పేర్కొన్నారు. *ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ పాలసీలు, పరిశ్రమలకు అనుకూల వాతావరణం, పారదర్శక పాలనతో ఆంధ్రప్రదేశ్ నేడు ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షిస్తోందని తెలిపారు.* అదేవిధంగా, రాష్ట్ర పర్యాటక రంగం ఒక కొత్త దిశలో ముందుకు సాగుతోందని మంత్రి గారు అన్నారు. సముద్ర తీరాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు, వారసత్వ సంపదతో కూడిన ఆంధ్రప్రదేశ్‌ను *గ్లోబల్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దడంలో ప్రవాసుల అంతర్జాతీయ అనుభవం కీలకమని పేర్కొన్నారు.* పెట్టుబడులతో పాటు, *పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధి, డెస్టినేషన్ ప్రమోషన్, అంతర్జాతీయ నెట్‌వర్క్‌లతో అనుసంధానం ద్వారా ప్రవాసులు రాష్ట్రానికి విలువైన భాగస్వాములుగా నిలవగలరని తెలిపారు.* హోటల్స్, రిసార్ట్స్, ఈకో, మెడికల్ & వెల్నెస్ టూరిజం రంగాల్లో వారి భాగస్వామ్యం ఉపాధి సృష్టికి, స్థానిక ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు. *“మీ మూలాలు ఇక్కడే – మీ భాగస్వామ్యం కూడా ఇక్కడే”* అనే భావనతో ప్రవాసులు ముందుకు రావాలని ఆంధ్రప్రదేశ్ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి–పర్యాటకం – ఉపాధి రంగాల్లో ప్రభుత్వం–ప్రవాసులు కలిసి ఒక బలమైన భాగస్వామ్యాన్ని నిర్మించుకుందామని మంత్రి వర్యులు కందుల దుర్గేష్ గారు పిలుపునిచ్చారు. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వర్యులు “గౌ.కందుల దుర్గేష్” గారి కార్యాలయం (నిడదవోలు) END

✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం
గోపాలపురం మండలం
పున్నమి సీనియర్ రిపోర్టర్
9989086083.

ప్రవాస భారతీయుల దినోత్సవం *(జనవరి 9)* సందర్భంగా మంత్రి వర్యులు కందుల దుర్గేష్ గారు *ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రవాస సోదర సోదరీమణులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.* ప్రవాస భారతీయులు కేవలం విదేశాల్లో నివసించే వారు మాత్రమే కాక, *ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్లుగా నిలుస్తున్న శక్తి అని ఆయన అన్నారు.*

పెట్టుబడులు, నైపుణ్యాల మార్పిడి, విద్య, వైద్యం, సాంకేతికత, పరిశ్రమల రంగాల్లో ప్రవాసుల అనుభవం రాష్ట్ర పురోగతికి బలమైన పునాదిగా మారుతోందని పేర్కొన్నారు. *ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ పాలసీలు, పరిశ్రమలకు అనుకూల వాతావరణం, పారదర్శక పాలనతో ఆంధ్రప్రదేశ్ నేడు ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షిస్తోందని తెలిపారు.*

అదేవిధంగా, రాష్ట్ర పర్యాటక రంగం ఒక కొత్త దిశలో ముందుకు సాగుతోందని మంత్రి గారు అన్నారు. సముద్ర తీరాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలు, వారసత్వ సంపదతో కూడిన ఆంధ్రప్రదేశ్‌ను *గ్లోబల్ టూరిజం హబ్‌గా తీర్చిదిద్దడంలో ప్రవాసుల అంతర్జాతీయ అనుభవం కీలకమని పేర్కొన్నారు.* పెట్టుబడులతో పాటు, *పర్యాటక మౌలిక సదుపాయాల అభివృద్ధి, డెస్టినేషన్ ప్రమోషన్, అంతర్జాతీయ నెట్‌వర్క్‌లతో అనుసంధానం ద్వారా ప్రవాసులు రాష్ట్రానికి విలువైన భాగస్వాములుగా నిలవగలరని తెలిపారు.* హోటల్స్, రిసార్ట్స్, ఈకో, మెడికల్ & వెల్నెస్ టూరిజం రంగాల్లో వారి భాగస్వామ్యం ఉపాధి సృష్టికి, స్థానిక ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు.
*“మీ మూలాలు ఇక్కడే – మీ భాగస్వామ్యం కూడా ఇక్కడే”*
అనే భావనతో ప్రవాసులు ముందుకు రావాలని ఆంధ్రప్రదేశ్ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధి–పర్యాటకం – ఉపాధి రంగాల్లో ప్రభుత్వం–ప్రవాసులు కలిసి ఒక బలమైన భాగస్వామ్యాన్ని నిర్మించుకుందామని మంత్రి వర్యులు కందుల దుర్గేష్ గారు పిలుపునిచ్చారు.

రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వర్యులు “గౌ.కందుల దుర్గేష్” గారి కార్యాలయం (నిడదవోలు)

END

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.