శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, జనవరి 06 శ్రీకాళహస్తి నియోజిక వర్గ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి విద్యుత్ చార్జీలు పెంచమన్న ఎన్నికల హామీని ముఖ్యమంత్రి అమలు చేసిన సమాచారాన్ని మీడియా ద్వారా సమాచారాన్ని ఎమ్మెల్యే వెలిబుచ్చారు. సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలకోసం ముఖ్యమంత్రి చేస్తున్న కృషి ఎనలేనిదని చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ఎన్నికల సమయంలో విద్యుత్ చార్జీలు పెంచబోమని ఇచ్చిన ఎన్నికల హామీల అమలులో భాగంగా నేడు కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలపై రూ.4,498 కోట్ల విద్యుత్ భారం – పడకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు – తప్పించారని శ్రీ కాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తెలిపారు. 2019–24 – మధ్యకాలంలో ట్రూ అప్ చార్జీలు రూ.4498 7 కోట్లు వసూలు చేసేందుకు ఏపీఈఆర్సి కూటమి ప్రభుత్వానికి లేఖ రాయగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ భారాన్ని ప్రజలపై వేయొద్దని, ప్రభుత్వమే చెల్లిస్తుందని ప్రకటించటం ప్రజలకు మేలు చేసే విషయంగా పేర్కొన్నారని చంద్రబాబునాయుడు చేపడుతున్న విద్యుత్ సంస్కరణల ఫలితంగా ఏపీఈ అర్సి ఏర్పాటు అయిన 1999 నుండి తొలిసారి ట్రూ డౌన్ చార్జీలు నమోదు అవుతున్నాయన్నారు. ట్రూ డౌన్ అమలు ద్వారా తమ ప్రభుత్వం విద్యుత్ చార్జీల్లో ‘యూనిట్‌కు 13 పైనలు తగ్గించిందని తెలియజేశారు. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచేది లేదని స్పష్టమైన హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు వేలకోట్ల ట్రూ అప్ ద్వారాన్ని ప్రజలపై పడకుండా చూడటం చారిత్రాత్మక నిర్ణయంగా బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి అభివర్ణించారు. విద్యుత్ చార్జీలు తగ్గిస్తానని ప్రమాణస్వీకారం రోజున రాష్ట్ర ప్రజల పై విద్యుత్ చార్జీల భారం లేకుండా చుస్తానని ప్రగల్భాలు పలికిన జగన్ మోహన్ రెడ్డి తన అయిదేళ్ళ అస్తవ్యస్త పాలన విధానాల ద్వారా 5 ఏళ్ళ పాలనలో 9 సార్లు విద్యుత్ చార్జీలు పెంచి రూ.32 వేల కోట్ల భారాన్ని ప్రజలపై మోపారని ఆరోపించారు. 2019లో మిగులు విద్యుత్ తో ఉన్న రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో విద్యుత్ కోతలతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని విమర్శించారు. కమిషన్లకు కక్కుర్తి పడి ఎక్కువ ధరకు విద్యుత్ ను కొనుగోలు ద్వారా విద్యుత్ పంపిణీ సంస్థలకు మొయలేని అప్పులు భారం మిగిల్చారని విమర్శల వర్షం కురిపించారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆక్వా రైతులకు యూనిట్ కు రూ.3.50 చొప్పున వసూలు చేయగా తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కీలక నిర్ణయం తీసుకొని యూనిట్‌కు రూ.1.50 తగ్గించి ఆక్వా రైతులకు ఊరట కల్పించారని బొజ్జల గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో రూ.5.19 లకు యూనిట్ విద్యుత్ ను కొనుగోలు చేయగా తమ ప్రభుత్వం రూ.4.70 కొనుగోలు చేస్తుందని వివరించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్నప్పటికీ ప్రజల సంక్షమాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో వయనింపజేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెన్యువబుల్ ఎనర్జీకి అధిక ప్రాధాన్యమిస్తూ సోలార్, పవన విద్యుత్ ఏర్పాటే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని తెలియజేశారు. సోలార్ పవర్ ను ప్రోత్సహించేందుకు ఎస్సీ, ఎస్టీలకు ఉచిత సోలార్ రూఫ్ టాప్‌లు అందించడంతో పాటు బీసీ వర్గాలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీకి అదనంగా రూ.20 వేలు కూటమి ప్రభుత్వం ఇస్తుందని ఎమ్మెల్యే బొజ్జల పేర్కొన్నారు. చంద్రబాబు పాలనలో విద్యుత్ కోతల నుండి ప్రజలను విముక్తి కల్పించడమే కాకుండా విద్యుత్ చార్జీల భారం కూడా పడకుండా తప్పించి రాష్ట్ర ప్రజలకు ఆపద్బాంధవుడిగా మారారని ప్రశంసించారు, ప్రజల సంక్షేమం కోసం ఎంతగానో కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ప్రజలందరూ అండగా ఉండాలని ఈ సందర్భంగా బొజ్జల సుధీర్ రెడ్డి పిలుపునిచ్చారు.
Uploaded Video:


