Sunday, 22 March 2026
  • Home  
  • తాగునీరు బోరు ఆక్రమణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ స్కీల్ నాయకుడు ఆందోళన
- కామారెడ్డి

తాగునీరు బోరు ఆక్రమణకు వ్యతిరేకంగా కాంగ్రెస్ స్కీల్ నాయకుడు ఆందోళన

కామారెడ్డి, 04 జనవరి,( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా, కాంగ్రెస్ పార్టీ రామారెడ్డి మండల ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు కళ్లెం రాజేందర్ మాట్లాడు తూ, మోషంపూర్ గ్రామానికి సంబంధించిన తాగు నీటి బోరు మోటర్‌ను ఒక వ్యక్తి కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. ఆ వ్యక్తి ఇటీ వల ఒకరి దగ్గర భూమి కొనుగోలు చేసి, ఆ భూమి లోని బోర్ మోటర్‌ను ఆక్రమించాలని చూస్తున్నా డని వాపోయారు. ఇది గ్రామ తాగునీటి సౌకర్యా నికి చెందినదని, అధికారులు తక్షణ చర్యలు తీసు కుని గ్రామస్తులకు ఇబ్బంది కలగకుండా చూడాలని వేడుకున్నారు.మోషంపూర్ శివారులో గల అసైన్డ్ భూమి 203 అసైన్డ్ పట్టా మొత్తం ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఇంతవరకు ఎంత ఆక్రమించబడింది, మిగిలిన భూమి ఎంత ఉందో రెవెన్యూ శాఖ వివ రాలు గ్రామపంచాయతీ, గ్రామస్తులకు అందించా లని కళ్లెం రాజేందర్ డిమాండ్ చేశారు. మోషంపూర్ గ్రామ పంచాయతీ గోదాంల సందర్శన.. టాక్స్ వసూల్, లేబర్ సమస్యలపై చర్చ మోషంపూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జార లక్ష్మీరాజయ్య, ఉపసర్పంచ్ వంగ సంతోష్‌రెడ్డి, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, గ్రామ జిపిఓ, ఫీల్డ్ అసిస్టెంట్, గ్రామ సిబ్బంది, గ్రామ ప్రజలు కలిసి గ్రామ శివారులోని గోదాంలను సంద ర్శించారు. అక్కడి పరిస్థితులు తెలుసుకుని, జిపి టాక్స్ వసూల్, గత రెండు సంవత్సరాల్లో ఎంత వరకు టాక్స్ చెల్లించారో వివరాలు సేకరించా రు. జిపిఓ ఆధ్వర్యంలో 17వ నంబర్ గోదాముకు కొలతలు తీశారు. మా గ్రామ ప్రజలు గోధుములలో పనులు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని, వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వేరే ఊర్ల నుంచి లేబర్ తీసుకురాకుండా, స్థానికులకు ఉపాధి కల్పించాలని విన్నవించారు.గోదాం ఇన్‌చా ర్జ్ సందీప్‌తో ఇతర విషయాలు చర్చించారు. ప్రస్తు తం సిబ్బంది వేరే ఊర్లకు వెళ్లడం వల్ల పూర్తి వివరాలు ఇవ్వలేకపోతున్నామని, 2-3 రోజుల్లో పూర్తి సమాచారం ఇస్తామని సందీప్ హామీ ఇచ్చా రు. అక్కడి లేబర్లకు సమయానికి జీతాలు చెల్లిస్తు న్నారా, ఇతర సమస్యలు ఉంటే తెలియజేయాలని ఆరా తీశారు.

కామారెడ్డి, 04 జనవరి,( పున్నమి ప్రతినిధి ) :

కామారెడ్డి జిల్లా, కాంగ్రెస్ పార్టీ రామారెడ్డి మండల ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు కళ్లెం రాజేందర్ మాట్లాడు తూ, మోషంపూర్ గ్రామానికి సంబంధించిన తాగు నీటి బోరు మోటర్‌ను ఒక వ్యక్తి కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. ఆ వ్యక్తి ఇటీ వల ఒకరి దగ్గర భూమి కొనుగోలు చేసి, ఆ భూమి లోని బోర్ మోటర్‌ను ఆక్రమించాలని చూస్తున్నా డని వాపోయారు. ఇది గ్రామ తాగునీటి సౌకర్యా నికి చెందినదని, అధికారులు తక్షణ చర్యలు తీసు కుని గ్రామస్తులకు ఇబ్బంది కలగకుండా చూడాలని వేడుకున్నారు.మోషంపూర్ శివారులో గల అసైన్డ్ భూమి 203 అసైన్డ్ పట్టా మొత్తం ఎన్ని ఎకరాలు ఉన్నాయి, ఇంతవరకు ఎంత ఆక్రమించబడింది, మిగిలిన భూమి ఎంత ఉందో రెవెన్యూ శాఖ వివ రాలు గ్రామపంచాయతీ, గ్రామస్తులకు అందించా లని కళ్లెం రాజేందర్ డిమాండ్ చేశారు.

మోషంపూర్ గ్రామ పంచాయతీ గోదాంల సందర్శన..

టాక్స్ వసూల్, లేబర్ సమస్యలపై చర్చ

మోషంపూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జార లక్ష్మీరాజయ్య, ఉపసర్పంచ్ వంగ సంతోష్‌రెడ్డి, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, గ్రామ జిపిఓ, ఫీల్డ్ అసిస్టెంట్, గ్రామ సిబ్బంది, గ్రామ ప్రజలు కలిసి గ్రామ శివారులోని గోదాంలను సంద ర్శించారు. అక్కడి పరిస్థితులు తెలుసుకుని, జిపి టాక్స్ వసూల్, గత రెండు సంవత్సరాల్లో ఎంత వరకు టాక్స్ చెల్లించారో వివరాలు సేకరించా రు. జిపిఓ ఆధ్వర్యంలో 17వ నంబర్ గోదాముకు కొలతలు తీశారు. మా గ్రామ ప్రజలు గోధుములలో పనులు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని, వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. వేరే ఊర్ల నుంచి లేబర్ తీసుకురాకుండా, స్థానికులకు ఉపాధి కల్పించాలని విన్నవించారు.గోదాం ఇన్‌చా ర్జ్ సందీప్‌తో ఇతర విషయాలు చర్చించారు. ప్రస్తు తం సిబ్బంది వేరే ఊర్లకు వెళ్లడం వల్ల పూర్తి వివరాలు ఇవ్వలేకపోతున్నామని, 2-3 రోజుల్లో పూర్తి సమాచారం ఇస్తామని సందీప్ హామీ ఇచ్చా రు. అక్కడి లేబర్లకు సమయానికి జీతాలు చెల్లిస్తు న్నారా, ఇతర సమస్యలు ఉంటే తెలియజేయాలని ఆరా తీశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.