గాజువాక డిసెంబర్ (పున్నమి ప్రతినిధి)
పాత గాజువాక జంక్షన్‌లో కీర్తిశేషులు వంగవీటి మోహనరంగా 37వ వర్ధంతి సందర్భంగా రాయల్ యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో గాజువాక శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు పాల్గొని వంగవీటి మోహనరంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి వంగవీటి మోహనరంగా చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. ప్రజల కోసం నిర్భయంగా పోరాడిన నాయకుడిగా ఆయన పేరు చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. మోహనరంగా ఆశయాలను నేటి యువత కొనసాగించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయల్ యూత్ ఫోర్స్ సభ్యులు, పార్టీ నాయకులు, యువకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని మోహనరంగా త్యాగాలను స్మరించుకున్నారు.


