— పున్నమి ప్రతినిధి
దేశీయ మార్కెట్లో ఈ ఏడాది కూడా ఐపీఓల హవా కొనసాగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా తొలి పబ్లిక్ ఆఫర్లు భారీగా నిధులు సమీకరించాయి. మొత్తం మీద 103 కంపెనీలు రూ.1.76 లక్షల కోట్లను ఐపీఓల ద్వారా సమీకరించాయి. మార్కెట్ లిక్విడిటీ, మదుపర్ల విశ్వాసం, దేశీయ స్థూల ఆర్థిక పరిస్థితులకు ఇది అద్దం పడుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొత్త ఏడాదిలోనూ ఇదే ఉత్సాహం కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు.


