— పున్నమి ప్రతినిధి
జనవరి 1 నుంచి దేశవ్యాప్తంగా పలు కీలక ఆర్థిక మార్పులు అమల్లోకి రానున్నాయి. ఎల్పీజీ, వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉండగా, సవరించిన ఫిక్స్‌డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు అమలులోకి రానున్నాయి. పాన్–ఆధార్ లింకేజీ తప్పనిసరి చేయడంతో పాటు సిమ్ వెరిఫికేషన్ నిబంధనలు కఠినతరం కానున్నాయి. ఉద్యోగులకు కరవు భత్యం పెరగనుండగా, కొత్త ఐటీఆర్ ఫారం ప్రవేశపెట్టే అవకాశముంది.


