— పున్నమి ప్రతినిధి
రష్యా మంగళవారం తెల్లవారుజామున ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై వైమానిక దాడికి పాల్పడింది. ఈ దాడి నేపథ్యంలో గగనతలంలో ఉన్న ముప్పును ఎదుర్కొనేందుకు ఉక్రెయిన్ వైమానిక రక్షణ దళాలు అప్రమత్తమయ్యాయని అధికారులు తెలిపారు. పూర్తి స్పష్టత వచ్చే వరకు పౌరులు షెల్టర్లలోనే ఉండాలని సూచించారు. దాడికి సంబంధించి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం వివరాలు ఇప్పటివరకు తెలియరాలేదని వెల్లడించారు.


