మధురవాడలో వాంబే కాలనీలో బయల్పడిన పురాతన శ్రీరాముడి విగ్రహం!
*విశాఖపట్నండిసెంబర్ 20పున్నమి ప్రతినిధి*
మధురవాడ వాంబే కాలనీలోని 80 అడుగుల రోడ్డు విస్తరణ పనుల్లో స్వయంభువుగా దర్శనమిచ్చారు. నేలతల్లి ఒడిలో ఇన్నాళ్లూ నిగూఢంగా ఉన్న ఆ పురాతన విగ్రహం బయటపడటంతో, స్థానికుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
విగ్రహం దొరికిన వార్త దావాగ్నిలా వ్యాపించడంతో, పరిసర ప్రాంతాల ప్రజలంతా తండోపతండాలుగా తరలివచ్చారు. “జై శ్రీరామ్” అన్న నామస్మరణతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోయింది. ఇది సాక్షాత్తూ ఆ రామచంద్రుడి సంకల్పమని, తమ కాలనీని ఆశీర్వదించడానికే స్వామివారు ప్రత్యక్షమయ్యారని భక్తులు భావోద్వేగానికి లోనయ్యారు.
ఘనంగా పూజా కార్యక్రమాలు
సామాన్య ప్రజలే కాకుండా, స్థానిక నాయకులు సైతం స్వామివారి సేవలో పాల్గొన్నారు


