Wednesday, 4 March 2026
  • Home  
  • ప్రజలే నా దేవుళ్లు.. నిరంతరం ప్రజాసేవే మేడిపల్లి నక్కర్త నా తల్లిలాంటిది’ ఆలంపల్లి లావణ్య నర్సింహా
- E-పేపర్

ప్రజలే నా దేవుళ్లు.. నిరంతరం ప్రజాసేవే మేడిపల్లి నక్కర్త నా తల్లిలాంటిది’ ఆలంపల్లి లావణ్య నర్సింహా

పున్నమి ప్రతినిధి: ప్రజలే నా దేవుళ్లు.. నిరంతరం ప్రజాసేవే మేడిపల్లి నక్కర్త నా తల్లిలాంటిది’ ఆలంపల్లి లావణ్య నర్సింహా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండల పరిధిలోని మేడిపల్లి నక్కర్త గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మిత్రపక్షాల తరఫున పోటీ చేసిన సర్పంచ్ అభ్యర్థి ఆలంపల్లి లావణ్య నర్సింహా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తమ ప్యానల్ వార్డు సభ్యులకు, మిత్రపక్ష అభ్యర్థులకు ఓటేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందఠరేగా మాట్లాడుతూ ఆయన “గెలుపు-ఓటములు రాజకీయాల్లో సహజం. ఎన్ని అడ్డంకులు ఎదురైనా నా సావాసం ప్రజలతోనే ఉంటుంది. ప్రజలే నా దేవుళ్లు. మేడిపల్లి నక్కర్త నా కన్న తల్లిలాంటిది” అన్నారు. ఎన్నికల ఫలితాలపై ఎవరూ అధైర్యపడకుండా ధైర్యంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గెలిచిన పాలకవర్గంతో కలిసి గ్రామ అభివ ృద్ధికి తమవంతు సహకారం అందిస్తామని, గెలుపు కోసం కష్టపడ్డ మిత్రపక్ష కార్యకర్తలకు, తనకు అండగా నిలిచిన మేడిపల్లి నక్కర్త గ్రామ ప్రజలందరికీ తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని లావణ్య నర్సింహా స్పష్టం చేశారు. గ్రామ ప్రజలంతా తన హృదయంలో ఎప్పటికీ పదిలంగా ఉంటారని పేర్కొన్నారు. ప్రజల తీర్పును శిరసావహిస్తూ, ఎప్పుడూ గ్రామ అభివృద్ధి కోసం శాయశక్తులా పనిచేస్తానని తెలిపారు. చివరగా “గెలుపు–ఓటమి సహజం ప్రజల తీర్పే అంతిమం” అని అన్నారు.

పున్నమి ప్రతినిధి:
ప్రజలే నా దేవుళ్లు.. నిరంతరం ప్రజాసేవే
మేడిపల్లి నక్కర్త నా తల్లిలాంటిది’
ఆలంపల్లి లావణ్య నర్సింహా
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం యాచారం మండల పరిధిలోని మేడిపల్లి నక్కర్త గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మిత్రపక్షాల తరఫున పోటీ చేసిన సర్పంచ్ అభ్యర్థి ఆలంపల్లి లావణ్య నర్సింహా ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తమ ప్యానల్ వార్డు సభ్యులకు, మిత్రపక్ష అభ్యర్థులకు ఓటేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందఠరేగా మాట్లాడుతూ ఆయన “గెలుపు-ఓటములు రాజకీయాల్లో సహజం. ఎన్ని అడ్డంకులు ఎదురైనా నా సావాసం ప్రజలతోనే ఉంటుంది. ప్రజలే నా దేవుళ్లు. మేడిపల్లి నక్కర్త నా కన్న తల్లిలాంటిది” అన్నారు. ఎన్నికల ఫలితాలపై ఎవరూ అధైర్యపడకుండా ధైర్యంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గెలిచిన పాలకవర్గంతో కలిసి గ్రామ అభివ ృద్ధికి తమవంతు సహకారం అందిస్తామని, గెలుపు కోసం కష్టపడ్డ మిత్రపక్ష కార్యకర్తలకు, తనకు అండగా నిలిచిన మేడిపల్లి నక్కర్త గ్రామ ప్రజలందరికీ తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని లావణ్య నర్సింహా స్పష్టం చేశారు. గ్రామ ప్రజలంతా తన హృదయంలో ఎప్పటికీ పదిలంగా ఉంటారని పేర్కొన్నారు. ప్రజల తీర్పును శిరసావహిస్తూ, ఎప్పుడూ గ్రామ అభివృద్ధి కోసం శాయశక్తులా పనిచేస్తానని తెలిపారు. చివరగా “గెలుపు–ఓటమి సహజం ప్రజల తీర్పే అంతిమం” అని అన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.